అగ్నిధారన్యూస్ ( కామారెడ్డి )

కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి పై అవిశ్వాసం నెగ్గింది. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో శనివారం చైర్ పర్సన్ పై పెట్టిన అవిశ్వాసం పై కౌన్సిలర్లతో అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. 49 మంది సభ్యులు ఉన్న కౌన్సిల్లో అవిశ్వాసం నెగ్గడానికి 34 మంది సభ్యులు అవసరం ఉంది. 37 మంది సభ్యులు హాజరై తమ మద్దతును తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 27 మంది కౌన్సిలర్లు, బీఆర్ఎస్ కు చెందిన పదిమంది కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, మున్సిపల్ కమిషనర్ సుజాత ఆధ్వర్యంలో అవిశ్వాస తీర్మానంపై సమావేశం నిర్వహించారు. 37 మంది సభ్యులు మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి కి వ్యతిరేకంగా చేతులెత్తి మద్దతు తెలిపారు. దీంతో అధికారులు అవిశ్వాసం నెగ్గినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం ఆవరణలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.