అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్ రూరల్

సుల్తానాబాద్ మండలంలోని మంచిరామీ గ్రామంలో పోచమ్మ తల్లి బోనాల జాతర  పోతురాజు విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు పాల్గొన్నారు. ఆయనకు మంచిరామీ ఆడబిడ్డలు పోచమ్మ తల్లి బోనాలతో ఘన స్వాగతం పలికినారు.   ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన శాసనసభ్యులు, మంచిరామి గ్రామంలోనీ ప్రజలు  పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు సు:ఖ సంతోషాలతో ఉండాలని అమ్మ తల్లిని కోరుకుంటున్నా అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.