ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్
అగ్ని ధార న్యూస్ (మహబూబాబాద్ )
మహబూబాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఐ.పి.ఎస్ మాట్లాడుతూ,పెరిగిపోతున్న టెక్నాలజీకి తగ్గట్టుగానే దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లాలో సైబర్ క్రైమ్ యూనిట్ క్షేత్ర స్థాయిలో పని చేస్తుందని,తద్వారా సైబర్ నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ సైబర్ నేర బాదితులకు మెరిగైన సేవలు అందించడానికి సైబర్ వారియర్స్ కి ఒక మొబైల్ ఫోన్ తో పాటు సిమ్ ని మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో అందించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో జరిగే సైబర్ నేరాలను ఏక్కడికక్కడే నియంత్రించేందుకు పోలీస్ స్టేషన్ వారీగా ఈ విభాగాలు కృషి చేస్తాయని తెలిపారు. సైబర్ కేసుల్లో పూర్తి స్థాయి ఆధారాలు సేకరించి నేరస్ధులను గుర్తించటం, నేరగాళ్లకు శిక్ష పడేలా చేయడం, బాధితులకు న్యాయం చేయడం అనేది సైబర్ వారియర్స్ చాలేంజ్ గా తీసుకొవాలన్నారు.
ఈ సైబర్ వారియర్స్ సైబర్ ఆర్దిక నేరాలు, కంప్యూటర్ వైరస్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ చాలెంజెస్, రిస్క్ అండ్ మేనేజ్‌మెంట్, నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ యాక్ట్, కమ్యూనికేషన్ వ్యవస్థ, ఇంటర్‌నెట్ డేటా సెంటర్, నెట్ వర్కింగ్ వ్యవస్థ, నేషనల్ నాలెడ్జ్ నెట్‌వర్క్, ఇన్ఫర్మేషన్ ఆడిటింగ్ కంప్లైన్స్, ఐవోటీ, క్లిష్టమైన వెబ్ అప్లికేషన్స్, సెక్యూరిటీ రిస్క్స్, మొబైల్ అప్లికేషన్స్ సెక్యూరిటీ, సోషల్ మీడియా ఇన్ ఈ గవర్నెన్స్, ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ తదితరాలపై శిక్షణ ఇచ్చినామని అన్నారు. జిల్లా పరిధిలో 18 పోలీస్ స్టేషన్లో 18 మంది సిబ్బందిని సైబర్ క్రైమ్ నేరాలను పరిష్కరించేందుకు కేటాయించినట్లు జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఐ.పి.ఎస్. తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ జోగుల చెన్నయ్య,సైబర్ క్రైమ్ డి.ఎస్.పి.శ్రీనివాస్, సైబర్ క్రైమ్స్ సీఐ వెంకటేశ్వర్లు,ఎస్.ఐ కరుణాకర్,సైబర్ వారియర్ కానిస్టేబుల్స్ సిబ్బంది పాల్గొన్నారు…