ఎండిన పాకాల ఏరు-దాహర్తి తీర్చేదెట్లా
వేసవిలో నీటి సమస్య తీర్చడానికి ముందస్తు జాగ్రత్త చర్యలేవి.
అగ్నిధారన్యూస్ (మహబూబాబాద్)
వేసవికాలం సమిపించడంతో ఎండల తీవ్రత పెరిగి భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంటాయని వాతావరణ అధ్యాయనాలే పేర్కొంటున్నాయి. భూమిపై ప్రతి జీవి బ్రతకడానికి ప్రాథమిక అవసరం నీరే. నీటి ఎద్దడీ సమస్య గ్రామాలలో, పట్టణాలలో తాగునిటీ సమస్య తీవ్రతరం అవుతుంది. వేసవిలో ఉష్ణోగ్రత అధికమవడంతో ప్రజలకు నీరందించే బావులు, చెరువులు, బోర్లలో నీరు అడుగంటి నీటి సరఫరా స్తంభించిపోతుంది. వివరాల్లోకి
వెళితే.. మహబూబాబాద్ జిల్లా, గార్ల,-బయ్యారం మండలాల ప్రజల దాహర్తి తీర్చేందుకు ప్రధాన నీటి వనరులైన పాకాల ఏరు, అలిగేరు, చెక్ డ్యామ్ లు నీళ్లు లేక పూర్తిగా ఏడిపోయి, రాళ్లు తేలిపోయి ఉన్నాయి. త్రాగు, సాగు నీరందించే పాకాల ఏరు, అలిగేరు, చెక్ డ్యామ్ లు ఎండిపోవడం తో నీటి కొరత ఏర్పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలకు దాహర్తి తీర్చే మార్గం లేకుండా పోయింది. ఇప్పటికైనా జిల్లా అధికారులు నీటి కొరత లేకుండా ఎస్ ఆర్ ఎస్పీ నుండి నీటిని విడుదల చేసి పాకాల ఏరు, అలిగేరు, చెక్ డ్యామ్ లను నింపాలని ప్రజలు కోరుతున్నారు. అధికారులు నీటి సమస్య తీర్చడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి..
