అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి)

కల్వకుర్తి మండలంలోని పంజూగుల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, వర్షపాకుల రమేష్ గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకున్న ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంగళవారం రోజున పంజుగుల గ్రామానికి వెళ్లి పరామర్శించారు. అదేవిధంగా గుండురు మాజీ సర్పంచ్ గోరటి వెంకటయ్య గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని వెంకటయ్య గృహానికి వెళ్లి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుంకిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కుటుంబాలకు అండగా ఉంటానని అన్నారు. కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు సుంకిరెడ్డి వరప్రసాద్ రెడ్డి, డిసిసి నాయకులు గోవిందు,కల్వకుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాపోతూ అనిల్ గౌడ్, మాజీ సర్పంచ్ శ్రీరాములు, నరేందర్ గౌడ్, కల్వకుర్తి, మడ్గుల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజు, దళపతి గౌడ్, మల్లేష్ నాయక్, గొడుగు మల్లయ్య,కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,అవ గణేష్, శేఖర్,శివ గౌడ్, శ్రీను నాయక్,పాండు,ఇమ్రాన్ బాబా,అభినవ్ రెడ్డి, కొండల్ రెడ్డి,కాకీ శివ,మహేష్ నాయక్,రాహుల్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.