పేద ప్రజలకి అండగా ఉంటా..

మరింత బాధ్యత పెరిగిందంటున్న న్యాయవాది మహేందర్.

మహేందర్ సేవలను కొనియాడిన కాంగ్రెస్ నాయకులు గాండ్ల మోహన్.

అగ్నిధారన్యూస్, కమాన్ పూర్:

కమాన్ పూర్ మండల కేంద్రం లో జూలపల్లి గ్రామానికికి చెందిన ఇరుగురాల మహేందర్ న్యాయవాది గోదావరిఖని బార్ అసోసియేషన్ లో జరిగిన ఎన్నికల్లో లైబ్రరీ సెక్రటరీగా భారీ మెజారిటీతో గెలిచినా సందర్భంగా.. జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గాండ్ల మోహన్, మచ్చ పారిశ్రామిక సహకార సంఘo అధ్యక్షులు గడప కృష్ణమూర్తి,   మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మల్యాల తిరుపతి,  కమన్పూర్ మాజీ సర్పంచ్ గట్టయ్య  ఘనంగా సన్మానించారు…..ఈ సందర్బంగా గాండ్ల మోహన్ మాట్లాడుతు.. మండలంలో అనేక మంది పేదలకు డబ్బులు ఆశించకుండా కోర్టులలో పలు  కేసులు వాదించి,గెలిపించడం కోసం ఎంతో కృషి చేసిన, చేస్తున్న న్యాయవాది మహేందర్ సేవలు మరువలేని అన్నారు. భవిష్యత్ లో కూడా మరింత మంది  పేదలకు అండగా ఉంటూ న్యాయం పక్షాన నిలవాలని కోరుకుంటున్నాను అని మోహన్ అన్నారు.