ఇంటి పన్ను కట్టలేమంటూ సుల్తానాబాద్ వాసుల ఆందోళన.
మున్సిపాలిటీగా మారాక పన్నుల భారం పెరిగిందంటున్న ప్రజలు.
అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్
మున్సిపాలిటీగా మారితే సదుపాయాలు పెరుగుతాయి అనుకున్న భారీగా విధించిన పన్నులతో సుల్తానాబాద్ మున్సిపాలిటీ పట్టణవాసులు మాకొద్దు ఈ మున్సిపాలిటీ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే వాణిజ్య భవనాలకు, ఇండ్లకు ఇష్టారితిన పన్నులు పెంచడంతో ఆస్తి పన్నును పున పరిశీలించాలని గత ప్రభుత్వంలోని ఇక్కడి పట్టణవాసులు ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వం మేజర్ గ్రామపంచాయతీ నుండి సుల్తానాబాద్ ను పురపాలక సంఘంగా మార్చింది. దీంతో ఇక్కడి ప్రాంత ప్రజలు అభివృద్ధి జరుగుతుందని భావించినప్పటికీ అభివృద్ధి మాట దేవుడెరుగు పన్నుల బాదుడు ఎక్కువైందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాగే గతంలో రెండు వేయిల రూపాయలు ఉన్న ఇంటి పన్ను ఇప్పుడు ఇరువై ఐదువేల రూపాయలు పెంచారని పట్టణవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అసలు. సుల్తానాబాద్ లో సుమారుగా ఐదువేల మూడు వందల నివాసాలు ఉన్నాయని ఇందులో సుమారుగా ఎనిమిది వందల ఇండ్లకు భారీగా ఇంటి పన్ను పెరగడంతో పట్టణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజువారి కూలీ చేసుకునే తమకు వేలకు వేలు ఇంటి పన్ను కట్టాలంటే భారంగా మారిందని పేద ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, మున్సిపాలిటీ అధికార యంత్రాంగం వాణిజ్య, ఇంటి పన్నుల పట్ల శ్రద్ధ చూపి తగ్గింపు చేయాలని పట్టణ వాసులు కోరుతున్నారు. ఏమవుతుందో వేచి చూడాలి మరి…!
సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ వివరణ
ధరణి, భువన్ యాప్ లలో సుల్తానాబాద్ పట్టణంలోని భూముల ధరలు ఎక్కువగా చూపుతున్నాయని అందుకే ఇంటి, వాణిజ్య పన్నులు ఎక్కువగా వస్తున్నాయని సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్ తెలిపారు. ఈ సమస్యను పురపాలక పాలకవర్గం సిడిఎంఏ (comissioner and director of municipal administration) దృష్టికి తీసుకెళ్లింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు.
