**ఉక్కు హామీ కీ తుప్పు పట్టిందా ****వివక్షకు పరాకాష్ట బయ్యారం ఉక్కు **
**ఈసారైనా ఉక్కు పరిశ్రమ ఊసెత్తెన **
**అబద్దాలను అందంగా చెబితే ప్రజలు నమ్మరు **
**అగ్నిధారన్యూస్ (బయ్యారం )**
మహబూబాబాద్ జిల్లా, బయ్యారం మండలంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో విభజన చట్టంలో స్పష్టంగా ఉన్న స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఎల్కు ప్రభుత్వాలు సుముఖంగా లేవని స్పష్టంగా అర్ధం అయింది. బయ్యారం మండలం చర్లపల్లి, సమీపంలోని పెద్దగుట్ట తోపాటు, రామచంద్రపురం, మొట్ల తిమ్మాపురం, అటవీ ప్రాంతంలో 60ప్లస్ శాతం ఇనుప ఖనిజ నిక్షేపాలు అపారంగా ఉన్నాయి. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కు పరిశ్రమ ఏర్పాటులో జాప్యం చేయడంలో అర్ధం ఏమిటని ప్రజలు అభిప్రాయం పడుతున్నారు. బయ్యారంలో మొట్టమొదట 1954లోనే మైనింగ్ ప్రారంభమై 1969వరకు కొనసాగింది. అప్పట్లోనే ఇక్కడి ఖనిజం రష్యా, జపాన్ వంటి దేశాలకు ఎగుమతి చేశారని, ఈప్రాంత ప్రజలు అంటున్నారు. అబద్దాలను అందంగా చెప్పి ఓట్లు వేయించుకుంటే, ఇక్కడి ప్రజలు నమ్మరని అంటున్నారు. ఇప్పటికైనా బయ్యారం ఉక్కు బిక్ష కాదు హక్కుగా భావించి ఉక్కు పరిశ్రమ డిమాండ్ ను నెరవేర్చాలని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు….

