పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ.

అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి)

ఆదివారం రోజు మంచిర్యాల పట్టణ కేంద్రంలోని ఎఫ్ సి ఐ ఫంక్షన్ హాల్లో ఇఫ్తార్ విందులో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ.. పాల్గొన్నారు..ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఇఫ్తార్ విందు సోదర భావాన్ని పెంపొందిస్తాయి అన్నారు.ముస్లిం సోదరులతో ఆత్మీయ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు నెల రోజులు లోక కళ్యాణకోసం, అత్యంత భక్తి శ్రద్దలతో ఉపవాసం ఉండి, సమాజంలో ప్రజలందరూ సు:ఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకుంటారని అన్నారు. నెలరోజుల ఉపవాస దీక్షతో అనేక సత్ ప్రయోజనాలు కలుగుతాయని అన్నారు. ఈ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. వారితో కలిసి ప్రార్థన చేశారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన అతిధులను ముస్లిం పెద్దలు సన్మానించారు.ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, మైనారిటీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.