మంత్రి శ్రీధర్ బాబు అయినా సోదరుడు శీనుబాబుపై విమర్శలు తగదు.

అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తిగా ఉండాలి.

ప్రజల మనసును ప్రేమతో, అభివృద్ధితో, పొందాలి.

విమర్శలు చేస్తే సహించేది లేదు.

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాయినాల రాజు.

అగ్నిధారన్యూస్,కమాన్ పూర్:

తెలంగాణ రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆయన సోదరుడు శీను బాబుపై చౌకబారు, అర్ధరహితమైన విమర్శలు చేస్తూ పబ్బం గడుపుతున్న పెద్దపల్లి జెడ్పి చైర్పర్సన్,పుట్ట మధు అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కమాన్ పూర్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు వాయినాల రాజు  అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులపై ప్రేమ ఉన్నవాడివి కనీసం ఒక్క లిఫ్టు అయినా పెట్టిచ్చావా, కాలేశ్వరం నుండి కనీసం రెండించుల పైపు కూడా రైతుల కోసం వేయలేదని, రైతాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన మండిపడ్డారు. మంథని ప్రాంతం కోసం ప్రాణ త్యాగం చేసిన కుటుంబం దుదిల్ల కుటుంబమని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రాంతం రైతాంగం కోసమే ఎల్లంపల్లి ప్రాజెక్టును కట్టించారని, గుండారం నుంచి ముత్తారం వరకు 2 టిఎంసి నిర్మించడం జరిగిందని అన్నారు. పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో రైతుల నుండి తరుగు పేరుతో బస్తాకు ఐదు ఐదు నుండి 10 కేజీలు కేజీలు కట్ చేసింది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రాంతం కోసం అహర్నిశలు పనిచేస్తున్న శ్రీధర్ బాబు, శ్రీను బాబు సోదరులపై చిల్లరమల్లర వేషాలు వేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఒక ప్రజా ప్రతినిధిగా, ప్రజలకు దగ్గర కావాలంటే, ప్రజల మనసును ప్రేమతో, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి, గెలుచుకోవాలన్నారు. విమర్శలు చేస్తే మీకన్నా 100 రేట్లు ఎక్కువగా మాట్లాడతాం అన్నారు. ఇప్పటికైనా అర్ధరహితమైన విమర్శలు మానుకోవాలని ఆయన సూచించారు. మీడియా సమావేశంలో కమాన్ పూర్ మండల కాంగ్రెస్ అధికార ప్రతినిధి చొప్పరి శేఖర్, గ్రామ శాఖ అధ్యక్షులు కొంతం శ్రీనివాస్, సీనియర్ నాయకులు చిక్కుల శ్రీనివాస్, గండేపల్లి రవి, నిరంజన్ నరేష్, లష్కర్ తదితరులు పాల్గొన్నారు.