అగ్నిధారన్యూస్ వనపర్తి జిల్లా: వనపర్తి మున్సిపల్ చైర్మన్,పుట్టపాకల మహేష్ సోమవారం పురపాలక సంఘం కార్యాలయంలో బల్దియా వాటర్ లైన్ మెన్ లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్టపాకల మహేష్ మాట్లాడుతూ….
ప్రస్తుతం పట్టణంలో వాటర్‌ ట్యాంకులకు నీటి సరఫరా చేస్తున్న తీరు, ఆ యా ట్యాంకుల పరిధిలోని నివాసాలకు నీటిని సరఫరా చేయడానికి పడుతున్న సమయం, పైప్‌లైన్ల పటిష్టత, వాల్వ్‌ల లీకేజీల సమగ్ర సమాచారం గు రించి వారిని అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్‌ పరిధిలో ని వార్డులలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. క్లోరినేషన్‌ విషయంలో కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని లైన్మెన్ లకు సూచించారు.