సమావేశంలో మాట్లాడుతున్న మారం తిరుపతి యాదవ్. 

అగ్నిధారన్యూస్ జూలపల్లి// పెద్దపల్లి 
ఆదివారం రోజు జూలపల్లి మండల కేంద్రంలో మండల కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త మారం తిరుపతి యాదవ్ పత్రిక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ…
జూలపల్లి డబల్ రోడ్డును రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ హైవేగా గుర్తింపు ఇవ్వాలని కోరుతూ…
ఈనెల 16. 06. 2024 ఆదివారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు జూలపల్లి మండల కేంద్రంలో మండలంలోని ప్రజలతో సమావేశం ఉన్నదని అన్నారు, ఈ సమావేశంలో జూలపల్లి స్టేట్ హైవే సాధన కమిటీని ఏర్పాటు చేస్తూ దాని ద్వారా గ్రామ గ్రామానా సంతకాల సేకరణతో స్టేట్ హైవేగా గుర్తింపు ఇవ్వాలని ప్రతిపాదిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాసే ప్రక్రియను మొదలుపెట్టడం జరుగుతుందని అన్నారు. జూలపల్లి మండలం అభివృద్ధి బాట పట్టాలంటే మండలంలోని ప్రజలందరూ జూలపల్లి స్టేట్ హైవే ఉద్యమానికి పోరాటానికి భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. గతంలో మండల ప్రజల భాగస్వామ్యంతో  పాదయాత్ర, ఆమరణ నిరాహారదీక్షలతో మన జూలపల్లి మండలానికి డబుల్ రోడ్డును సాధించుకోగలిగామని అలాగే  మండల అభివృద్ధి కోసం మరొక ఉద్యమానికి  మనం పునాది వేయవలసిన ఆవశ్యకత  ఉన్నదని పటిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని కార్యాచరణ రూపొందించుకోవడానికి త్వరలో ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ డబుల్ రోడ్డును రాష్ట్ర రహదారి/ స్టేట్ హైవేగా గుర్తించాలని మండలంలోని గ్రామ గ్రామాన స్టేట్ హైవే సాధన కమిటీని ఏర్పాటు చేసుకొని కమిటీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టి  స్టేట్ హైవే ఆవశ్యకతను వివరిస్తూ వినతి పత్రం రూపంలో అందించాలని, మన మండలానికి స్టేట్ హైవే గుర్తింపు వస్తే  మండల అభివృద్ధికి పూలబాట వేసుకున్నట్టే అని మండలంలో అద్భుతమైన అభివృద్ధిని చూడగలుగుతామని అన్నారు. కావున మొన్నటి డబుల్ రోడ్డు సాధన పాదయాత్రలో పెద్ద ఎత్తున మండలంలోని మహిళలు పాల్గొన్నారని, సంతకాల ఉద్యమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రతి గ్రామంలో ఉన్న ప్రజాప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు మండలంలో ఉన్న పెద్దలు రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి వివిధ పార్టీల నాయకులందరూ ఈ ఉద్యమానికి సహకరించి మన మండల అభివృద్ధికి దోహదపడాలని అన్నారు. ఇట్టి ఉద్యమంలో పార్టీలకతీతంగా పాల్గొని మండల అభివృద్ధిని కాంక్షించాలని, ఎలాంటి రాజకీయలకు తావు లేకుండా మన మండల అభివృద్దె ద్యేయంగా  కలిసి ఉద్యమం చేపట్టి మన మండలానికి వచ్చిన డబుల్ రోడ్డును స్టేట్ హైవేగా ప్రకటించే వరకు ఉద్యమాన్ని నిర్విరామంగా  కొనసాగిస్తూ స్టేట్ హైవేను సాధించుకోవాలని అన్నారు. గత ప్రభుత్వం సాంక్షన్ చేసిన నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు గ్రాంటును విడుదల చేయాలని గుత్తేదారు పనులు మొదలుపెట్టే విధంగా చర్యలు గైకొనాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టిన గుత్తేదారులకు కాంట్రాక్టర్లకు మండలంలో ఉన్న మనందరం పూర్తిగా సహకరించాలని నాణ్యమైన రోడ్డును వేయడానికి వారితో, నాణ్యతలో ఎక్కడ రాజీ పడకుండా పూర్తి చేయాలని అన్నారు. కమిషన్ల కోసము వారిని భయ ప్రాంతాలకు, బ్లాక్ మెయిలింగ్ లకు గురి చేయకుండా  ఏ నాయకుడు ప్రయత్నించవద్దని కాంట్రాక్టర్లను ఇబ్బందులకు గురి చేయవద్ధని గతంలో జూలపల్లి మండలానికి కాంట్రాక్ట్ చేయాలంటనే భయపడేవారని అలా కాకుండా మండల అభివృద్ధిలో గుత్తేదారుల పాత్ర ఉంటుందని మనందరం గ్రహించుకోవాలని, మండల అభివృద్ధికి దోహదపడే ఎవరికైనా పూర్తిగా మనం సహకరించాలని కోరుతున్నాను అన్నారు… స్టేట్ హైవే సాధన కమిటీలో పార్టీలకతీతంగా స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని జూలపల్లి మండలంలో ఉన్న ప్రజలందరికీ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మల్లెత్తుల నరసయ్య పుట్ట శ్రీకాంత్, ఆవుల ఐలయ్య, మల్లెత్తుల మల్లేశం, ప్రశాంత్, కటకం  శ్రీకాంత్, మారం వెంకటేశం తదితరులు పాల్గొన్నారు….