ఎంపీఓకి ఎవరి అండదండలు…

సహకరిస్తున్న అధికారులపై దృష్టి సారించాలి…

అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా )
పెద్దపల్లి జిల్లా మంథని ఎంపీఓ ఆ మండల పంచాయితీ కార్యదర్శులను గురిచేసిన విధానాలపై విసిగి చెందిన మండల పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు వేణు, నాయకులు సదయ్య, సాగర్ రావు,జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు సంతోష్ జరిగిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇంత బరితెగించి పంచాయతీ కార్యదర్శులను భయభ్రాంతులకు గురిచేసిన ఎంపీఓకు ….ఎవరి అండదండలు ఉన్నాయనే….? విషయంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా పంచాయతీ కార్యాలయంలో ఒకరిద్దరి అధికారుల అండదండలు మెండుగా ఉన్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఆవైపు దృష్టి సారిస్తే జిల్లాలోని ఆయా మండలాలలో జరిగే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంటుందని పలువురు అంటున్నారు…..

మంథని మండల పరిషత్ కార్యాలయంలో వారం రోజుల క్రితం పెద్దపల్లి జిల్లా స్థానిక సంస్థల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జెడ్పి సీఈవో,మంథని మండల స్పెషల్ ఆఫీసర్,నరేందర్...విచారణ చేపట్టి నివేదికను సమర్పించినట్లు తెలిసింది. దాదాపు పది రోజులు గడుస్తున్నా ఎంపీఓపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియక పంచాయతీ కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ఎంపీఓఫై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.