ధ్వంసమైన సిసి రోడ్లు పట్టించుకోని అధికారులు.

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లి మండలం, కొత్తపల్లి గ్రామంలో ప్రధాన చౌరస్తా వద్ద సిసి రోడ్డు మీద పదుల సంఖ్యలో మట్టి పోయడం ద్వారా గ్రామంలో పాదచారకులు, వాహనదారులు, తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. బుధవారం కురిసిన ఒక్క వర్షానీకే సీసీ రోడ్డు మొత్తం చిత్తడిగా మారింది, వర్షాకాలం ఆరంభంలోనే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో, మరిన్నె ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో, అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా సిసి రోడ్డు ధ్వంసం కావడానికి ప్రధానంగా, పెద్దకల్వల నుండి, ఓదెల మండల మండల కేంద్రం వరకు డిఎంఎఫ్టి నిధులతో చేపట్టిన రోడ్డు నిర్మాణపనులకు అధికలోడుతో మట్టి కంకరతో పాటు ఇతర సామాగ్రిని ఉపయోగించిన అధిక లోడు టిప్పర్లే అలాగే కొత్తపల్లిలో రైల్వే అండర్ బ్రిడ్జి కోసం వినియోగించిన టిప్పర్లు, ప్రధాన కారణం. గ్రామంలో రైల్వే గేట్ మొదలుకొని కొలనూరు వెళ్లే దారి వరకు సంబంధిత కాంట్రాక్టర్ల, నిర్లక్ష్యం వల్ల వేసవికాలంలో దాదాపు అర కిలోమీటర్ సిసి రోడ్లపైన టిప్పర్లు విద్యాంసాన్ని సృష్టించాయి.. సిసి రోడ్లను ధ్వంసం చేశారు. ఇదే విషయంపై పంచాయతీ కార్యదర్శిని సంప్రదించగా కాంట్రాక్టర్లు గ్రామపంచాయతీ రోడ్ల పైన  వాహనాలు నడపడానికి ఎలాంటి అనుమతి తీసుకోలేదన్నారు.
అదేవిధంగా పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, గ్రామ స్పెషల్ ఆఫీసర్, ను  సంప్రదించగా ఇట్టి విషయంపై సమాచారం ఎవరు ఇవ్వలేదని తెలిపారు. ధ్వంసం అయిన రోడ్లను బాగు చేసేది ఎవరు..? ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా రాబోయే రోజుల్లో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి…?