వారం రోజులు గడవకముందే మండల కేంద్రంలో మరో సంఘటన.
కఠినంగా శిక్షించాలి అంటున్న మహిళా సంఘాలు.
అగ్ని ధార న్యూస్ సుల్తానాబాద్
సుల్తానాబాద్ మండలం కేంద్రంలోని కాట్నపల్లి రైస్ మిల్లులో వారం రోజుల క్రిందట చిన్నారిపై జరిగిన అత్యాచార అనంతరం హత్య సంఘటన జరగకముందే సుల్తానాబాద్ మండలంలో,మరో సంఘటన ఆలస్యంగా, వెలుగులోకి రావడం ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. సంఘటన వివరాల్లోకి వెళితే సుల్తానాబాద్ మండలo లోని రేగడి మద్దికుంట గ్రామానికి చెందిన బాలిక పట్ల తాత వరస వృద్ధుడు చాక్లెట్లు, బిస్కెట్లు, కొనిస్తానని మభ్యపెట్టి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు హత్యచారయత్నానికి ప్రయత్నించిన వృద్ధున్నిపై బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విచారించి ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సుల్తానాబాద్ ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు.
