1-19 సంవత్సరాల పిల్లలందరికి మందులు పంపిణీ.

గాయత్రి విద్యాసంస్థల చైర్పర్సన్ అల్లెంకి శ్రీనివాస్…

అగ్నిధారన్యూస్,పెద్దపల్లి , జూన్ -20: 

ఆరోగ్యవంతంగా ఉండడం కోసం పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయించి, వారిని నులిపురుగుల నుండి రక్షణ పొందాలని గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ అన్నారు.  

గురువారం రోజు జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవ సందర్భాన్ని గాయత్రి విద్యాసంస్థలలో చదువుతున్న బాల బాలికలకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ….నులి పురుగులు శరీరంలో ఉండటం వల్ల తినే ఆహారంలో పోషకాలను గ్రహిస్తాయని, దీని వల్ల పిల్లలలో అనీమియా, రక్త స్రావం, ఎదుగుదల సరిగా లేకపోవడం వంటి జరుగుతాయని, వీటి నివారణకు తప్పనిసరిగా పిల్లలకు నులి పురుగుల నివారణ మందులు వేయడం జరుగుతుందన్నారు.

19 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒకరికి నులి పురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేశామని, ఏజ్ గ్రూప్ వారిగా నిర్దేశిత మందుల డోస్ ప్రతి విద్యార్థికి వైద్యశాఖ ఆధ్వర్యంలో ఇచ్చామన్నారు.

ప్రతి విద్యార్థి వ్యక్తిగత పరిశుభ్రత పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆహారం తీసుకునే ముందు, టాయిలెట్ వినియోగించిన తరువాత తప్పనిసరిగా సబ్బుతో చేతులు కడుక్కొవాలని విద్యార్థులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రజిని, ప్రిన్సిపాల్,విజయ్, ఏఎన్ఎం, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.