పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.

పాలకుర్తి,అంతర్గాం, రామగుండం.

అగ్నిధారన్యూస్,జూన్ -21:

పెద్దపల్లి జిల్లాలోనీ మూడు మండలాల తహశీల్దార్ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష రామగుండం, పాలకుర్తి, అంతర్గాం మండల తహశీల్దార్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తహసిల్దార్ కార్యాలయాలలో పనిచేస్తున్న సిబ్బంది, వారి విధుల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రతి మండలం పరిధిలో పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తుల వివరాలను ఆరా తీశారు.
ప్రతి మండల పరిధిలో నిర్దిష్టమైన ప్రణాళిక రూపొందించుకుని దాని ప్రకారం పెండింగ్ ధరణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలని, ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ధరణి దరఖాస్తులు పెండింగ్ ఉండకుండా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ప్రతి మండలంలో ఎక్కువ సమస్యలు ఉన్న గ్రామాల వివరాలను తెలుసుకున్న కలెక్టర్ వాటి పరిష్కారానికి అనుసరించాల్సిన వ్యూహాలపై పలు సూచనలు చేశారు. మండలాల పరిధిలో ఎక్కడా అక్రమంగా ఇసుక, మట్టి తరలింపు జరగకుండా తహశీల్దార్ లు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ తనిఖీల్లో జిల్లా కలెక్టర్ వెంట సంబంధిత మండలాల తహసిల్దార్లు, సిబ్బంది అధికారులు, ఉన్నారు.