అగ్నిధార న్యూస్, పెద్దపల్లి జిల్లా:
రామగుండం పోలీస్ కమిషనరేట్
గంజాయి అక్రమ రవాణా సాగుచేస్తున్న వ్యక్తుల అరెస్టు
*750 గ్రాములు గంజాయి స్వాధీనం*
పెద్దపల్లి ఏసిపి గారి కార్యాలయంలో పెద్దపల్లి డి సి పి రవీందర్ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నటువంటి నలుగురు నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించడం జరిగింది.
*వివరాల్లోకి వెళితే…..*
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపెల్లి జిల్లా పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని బండారి కుంట ప్రాంతంలో వేరే ప్రాంతం నుంచి గంజాయి తీసుకువచ్చి పెద్దపల్లి కి చెందిన వ్యక్తులకు సరఫరా చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్,పెద్దపల్లి ఎస్ఐ రాజేష్ మరియు ప్రొబేసినరి ఎస్ ఐ రాజవర్ధన్ సిబ్బందితో కలిసి బంగారి కుంట ప్రాంతానికి వెళ్లగా అక్కడ అనుమానాస్పదంగా నలుగురు వ్యక్తులు కనబడడం తో వారిని అదుపులోకి తీసుకుని వారి వివరాలు అడిగగా కాట్రోజు మంగ్యా నాయక్, కామారెడ్డి, బడావత్ బాబాన్ కుమార్,షైక్ అసిఫ్ పెద్దపల్లి, ఎస్ కె సాజిద్ పెద్దపల్లి అని తెలపగ వారిని తనిఖీ చేయగా వారి వద్ద 750 గ్రాములు గంజాయి లభించడం జరిగింది. వెంటనే వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న గంజాయి స్వాధీనం చేసుకుని పెద్దపల్లి పోలీస్ స్టేషన్ తరలించి వారిపై కేసు నమోదు చేయడం జరిగింది.
*నిందితుల వివరాలు*
1.కత్రోజు మంగ్యా నాయక్ s/o సాంగ్యా నాయక్ ,60 yrs ,ST, సదాశివ నగర్ కామారెడ్డి జిల్లా
*(మొక్కజొన్న పంటతో పాటు అంతర్ పంటగా గంజాయిని తన భూమిలో సాగు చెస్తాడు)*
2.బాధవత్ బాబాన్ కుమార్ s/o శ్రీరామ్ , 28 yrs, దేవితండా , యాచారం , నిజామాబాద్ జిల్లా
3.షైక్ అసిఫ్ s/o చాంద్ , 32 yrs , ముస్లిం , బండారికుంట, పెద్దపల్లి
3.Sk.సాజిద్ s/o సాదిక్, 21 సంవత్సరాలు, ముస్లిం , సాగర్ రోడ్ , పెద్దపల్లి
గంజాయి సరఫరా చేసే వ్యక్తులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న పెద్దపెల్లి ఏసిపి సారంగపాణి సీఐ ప్రదీప్ కుమార్, ఎస్సై లు రాజేష్, రాజ వర్ధన్ లతో పాటు సిబ్బందిని డిసిపి అభినందించారు.
