అగ్నిధారన్యూస్ పెద్దపల్లి
పెద్దపల్లి మండల కేంద్రంలోని సబ్బితం గ్రామానికి చెందిన మేకల కాపరులు మేకలు మేపడానికై గట్టుసింగారం గుట్టపైకి వెళ్లగా అక్కడ గుర్తు తెలియని మగ వ్యక్తి అస్తిపంజరంను గుర్తించి, సబ్బితం గ్రామపంచాయతీ కార్యదర్శి తెలుపగా, సబ్బితం కార్యదర్శి ఫిర్యాదు మేరకు బసంత్ నగర్ ఎస్సై కేసు నమోదు చేసుకుని, సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి అక్కడ మగ వ్యక్తి అస్తిపంజరం గుర్తించి, వయస్సు సుమారుగా 25 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు ఉంటుందని, అస్తిపంజరం గుర్తించిన చోటే, మెడికల్ ఆఫీసర్స్ పంచనామ నిర్వహించినట్లు, అలాగే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సైతెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

