అగ్నిధారన్యూస్, కరీంనగర్:
ఫుడ్ ఫైజన్ వల్ల ఆసుపత్రిలో ఉన్న విద్యార్థులను పరామర్శించిన విద్యార్థి యువజన నాయకులు.
ఆదివారం రోజు ఉదయం కరీంనగర్ నగరంలోని, శ్రీచైతన్య కళాశాల మంకమ్మ తోట హాస్టల్లో, విద్యార్థులు తిన్న టిఫిన్ ఫుడ్ పాయిజన్ కావడం వల్ల విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురైన విద్యార్థులను, రాఘవేంద్ర హాస్పిటల్ లో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చ రమేష్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బోనగిరి మహేందర్ ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగంధర్, నగర కార్యదర్శి చెంచల మురళి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు తిప్పార పురోహిత్ నగర కార్యదర్శి వినయ్ సాగర్ ఎం ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు చెంచల నవీన్, ఏఐఎస్ఎఫ్ నాయకులు కసిరెడ్డి సందీప్ రెడ్డి,వినయ్, పరామర్శించారు.
అనంతరం శ్రీచైతన్య కళాశాల యజమాన్య వైఖరిని నిరసిస్తూ కళాశాల ముందు విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థి, యువజన నాయకులు మాట్లాడుతూ… కరీంనగర్ నగరంలో విచ్చలవిడిగా ప్రైవేట్ హాస్టల్లు నెలకొన్నాయని వీటిని పర్యవేక్షించే అధికారులే లేకపోవడం వల్ల ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని, ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని శ్రీ చైతన్య కాలేజీలో జరిగిన సంఘటన దీనికి ఉదాహరణ అని ఆరోపించారు.
లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ప్రైవేట్ కళాశాలలో తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వీరిని నియంత్రించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.విద్యార్థులకు రోజు ఇచ్చే ఆహారం నాణ్యత లోపిస్తుందని నాణ్యత ప్రమాణాలు పాటించని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
కనీసం నెలకు ఒకసారి అయినా ఫుడ్ ఇన్స్పెక్షన్ అధికారులు, మున్సిపల్ అధికారులు వసతి గృహాలను సందర్శిస్తే వీరు ఇచ్చే ఆహారం ఏ విధంగా ఉంటుందో,అర్థమవుతుందన్నారు. విచ్చలవిడిగా ఇష్టారాజ్యంగా ప్రైవేట్ కళాశాలల హాస్టల్లో రాత్రి మిగిలిన అన్నాన్ని కిచిడి గా మార్చుతున్నారని పరిశుభ్రత పాటించకుండా నాణ్యత లేని నిత్యవసర వస్తువులను నాసిరకం వాడుతున్నారని దింతో విద్యార్థులు నష్టం జరిగిందని ఆరోపించారు.ఇంత జరిగినా కానీ శ్రీ చైతన్యకళాశాల చైర్మన్ అస్వస్థకు గురైన విద్యార్థులను సందర్శించకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు.వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి కిందిస్థాయి అధికారులకు ఆదేశించి ప్రతి హాస్టల్లో తనిఖీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అస్వస్థకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన కోరారు. లేని పక్షంలో,విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

