ప్లాస్టిక్ నియంత్రణలో విఫలమవుతున్న అధికారులు.
ప్లాస్టిక్ వ్యర్ధాల కాలుష్యంతో ప్రజల ప్రాణాలకు హాని.
ప్లాస్టిక్ కవర్ల అమ్మకాలు పట్టించుకోని అధికారులు..?
చిరు వ్యాపారుల నుండి బడా షాపుల వరకు ఇదే వాడకం.
ఒత్తిడులకు తలోగ్గుతున్న మున్సిపాలిటీ అధికారులు. ?
డ్రైనేజీల్లో వారాల తరబడి పొగుబడుతున్న ప్లాస్టిక్ వ్యర్ధాలు.
కాలుష్యంలో పెద్ద పాత్ర నిర్వహిస్తున్న ప్లాస్టిక్.
కలుషితమవుతున్న చేరువులు, కుంటలతో పంటనష్టాలు.
ముగాజీవాల ప్రాణాలు పోతున్న ఖాళీ కానీ చెత్తకుప్పలు.
అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్:
ప్లాస్టిక్ ఇది మనం నిత్య జీవితంలో ఓ భాగం అయిపోయింది. బకెట్లు, డబ్బాలు ,సంచులు ఇలా చెప్పుకుంటూ పోతే… ఏ మూల చూసిన కచ్చితంగా ఏదో ఒక రూపంలో ప్లాస్టిక్ కనిపిస్తూనే ఉంటుంది. అయితే ప్లాస్టిక్ వస్తువుల కన్నా ప్లాస్టిక్ సంచుల వాడకము ప్రమాదమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత మార్కెట్ లో 50 నుండి 75 మైక్రాన్ల వాడకుండా అతి తక్కువ ధరలకు, ఏదైనా వస్తును తీసుకెళ్లడానికి అనువుగా ఉండాలని 120 మైక్రాన్ల కన్నా ఎక్కువగా రేంజ్ లో ఉండే ప్లాస్టిక్ సంచులను అతిగా వాడి ఎక్కడపడితే అక్కడ వేయడం వలన ఇవి భూమిలో కరగడానికి కొన్ని వందల సంవత్సరాలు పడతాయని వీటి వల్ల భవిష్యత్తులో పెను ప్రమాదం ఏర్పడుతుందని పర్యావరణవిశ్లేషకులు భయపడుతున్నారు… వివరాల్లోకి వెళ్తే సుల్తానాబాద్ పట్టణంలో ప్లాస్టిక్ కవర్లు,వస్తువుల పై ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా విక్రయాలలో నిషేధ ఆజ్ఞలు ఉన్నప్పటికీ గుట్టు చప్పుడు కాకుండా వాటిని కిలోల చొప్పున, తక్కువ ధరలకు చుట్టుపక్కల లోని గ్రామాలలో ఉన్న కిరాణా షాపులకు విక్రయించడమే కాక వారసంతలో ఇష్ట రాజ్యంగ చిరు వ్యాపారుల నుండి మొదలుపెడితే బడా షాపుల వరకు నాణ్యతలేనిప్లాస్టిక్ కవర్లలో జోరుగా అమ్మకాలు జరుగుతున్నప్పటికీ వారసంతకు కూరగాయల మార్కెట్కు కూతవేటు దూరంలో ఉన్న పురపాలక సంఘం కార్యాలయం దగ్గర్లో ఉన్నప్పటికీ ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే సుల్తానాబాద్ తహసిల్దార్ కార్యాలయంలో కుప్పలు తెప్పలుగా ప్లాస్టిక్ వ్యర్ధాలు విచ్చలవిడిగా కార్యాలయ ఆవరణలో వేయడాన్ని పరిశీలిస్తే పరిస్థితి ఎలా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా హోటల్లో నాశీరకమైన కవర్లలో వేడి వేడి చాయ, వేడి వేడి సాంబారులు ప్యాకింగ్ చేస్తూ వినియోగదారులకు ఇస్తూ ఉండడంతో వారు అనారోగ్యాల బారిన పడుతున్నారు.తూతూ మంత్రంగా ఎప్పుడో ఒకసారి ఆకస్మిక తనిఖీల పేరుతో అధికారులు దాడులు నిర్వహిస్తున్నప్పటికీ చాలామంది వ్యాపారులు ప్లాస్టిక్ కవర్లు తమ దుకాణాలలో కనబడనీయకుండా జాగ్రత్త పడుతుండడం మరో విశేషం. వ్యాపార సముదాయాలపై దాడులు చేసిన ఆ ఒకటి రెండు రోజులు ప్లాస్టిక్ కవర్లలో అమ్మకాలు జరపకుండా జాగ్రత్త పడుతూ తరువాత ఇదే తంతుగా మళ్లీ ప్లాస్టిక్ కవర్లలో అమ్మకాలు జరుపుతున్నట్లు ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.
మూగ జీవాలు,ప్రజారోగ్యాలపై ఉన్నతాధికారులకు పట్టింపేది..?
పట్టణంలోని అనేక ప్రాంతాల్లో గుట్టల కొద్దీ ప్లాస్టిక్ మిగతా వ్యర్ధాలు పేరుకుపోయిన కూడా వారాల తరబడి మున్సిపాలిటీ అధికారులు సకాలంలో స్పందించకుండా చోద్యం చూడటం, వర్ష కాలం రావడంతో డ్రైనేజీల్లో ఎక్కువ మోతాదులో ప్లాస్టిక్ కి సంబంధించిన వ్యర్ధాలు దర్శనమివ్వడంతో సీజనల్ వ్యాధులు గురుంచి ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు..డెంగ్యూ, మలేరియా,టైపాయిడ్ లాంటి విష జ్వరాలతో, చర్మ సంబంధించిన వ్యాధులు సైతం ప్రబలడంతో అనారోగ్య ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని మా ప్రాణాలకు భరోసా ఇవ్వడంలో పారిశ్యుద్ధం మెరుగుపరుచడంలో అధికారులు విపలమవుతున్నారని ప్రజలు అంటున్నారు. చెత్తకుప్పలో పొగవుతున్న పలురకాల ప్లాస్టిక్ ని మూగ జీవాలు అనుకోకుండా కొన్ని సందర్భాల్లో ఆహారంగా తీసుకుని ప్రణాలు కోల్పోతున్న అధికారులు నియంత్ర చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
జలాల కలుషితంతో పంటలు నష్టాలు పెరుగుతున్నాయి...
డంపింగ్ యార్డ్ నిర్వహణ సరిగా లేకనే కొన్ని చోట్ల వర్షాకాలంలో నేరుగా డ్రైనేజీ వ్యవస్థలు లేక నేరుగా చెరువులల్లో కలుషితాలు చేరడంతో ఆయా కుంటలు, చెరువుల కిందనున్న రైతుల వ్యవసాయ క్షేత్రాలలో పంటల దిగుబడులు సైతం తాగిపోతున్నాయని, పంట నష్టం వస్తుందని, నీళ్ల కలుషితం అవ్వడంతో చేరువుల్లోని చేపల పెంపకంలో నష్టాలు వస్తున్నాయని వాటిపై జీవనం సాగిస్తున్న వారు తెలుపుతున్నారు..అదొక్కటే కాకుండా పొలాల్లోకి వచ్చే నీరు వాసన రావడంతో కూలీలు కూడా ఇబ్బందులు పడుతూనే ఉన్నారని అంటున్నారు.
ప్లాస్టిక్ కట్టడిలో మున్సిపాలిటి అధికారులు విఫలం.
సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలో పెద్ద మొత్తంలో జరిగేటువంటి మార్కెట్లో వినియోగిస్తున్న ప్లాస్టిక్ ని కట్టడి చేయాల్సిన అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ప్రశ్నర్ధకంగా మారింది. ప్లాస్టిక్ వినియోగంలో అనేక ప్రచార హడావిడులక్కు మాత్రమే ప్రభుత్వ యంత్రాంగం పరిమితమైందని మేధావి వర్గాల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్నిసార్లు తూతుమంత్రంగా తనిఖీలు చేసినప్పటికీ రాజకీయ నాయకుల ప్రమేయంతో వ్యాపారస్తుల విచ్చవిడి ప్లాస్టిక్ వినియోగానికి అడ్డు అదుపు లేకుండా పోవడం జరుగుతుంది. అధికారులు కొన్ని సందర్భాల్లో మామూళ్లకు తలొగ్గి పర్యావరణానికి హానికి బాటలు చేస్తున్నారడంలో అతిశయోక్తి లేదనే పలువురు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు..?ఇదంతా జరుగుతున్న చూసి చూడన్నట్లు వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు స్పందించాలని ప్రజలు వేడుకుంటున్నారు… అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి మరి..!




