ఆత్మహత్యకు కారణం అప్పులు కాదు..
నాయిని కుటుంబానికి న్యాయం జరగాలి.
రామగుండం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పర్కాల లక్ష్మీనారాయణ గౌడ్.
అగ్నిధార న్యూస్ ఆగస్టు :12 గోదావరిఖని :- గోదావరిఖని ప్రెస్ క్లబ్ సభ్యులు సీనియర్ జర్నలిస్ట్ మధునయ్య కు రామగుండం ప్రెస్ క్లబ్ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి ప్రధాన చౌరస్తాలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ గౌడ్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి జర్నలిస్టుగా సేవలందించినt మధునయ్య మరణం తీరని లోటని పునరుద్గటించారు. అయితే కొందరు తను ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని తను సింగరేణి కార్మికుడిగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన తర్వాత వచ్చినటువంటి డబ్బులను తన ఇంట్లో వాళ్లకు తెలియకుండా కొంత మంది వ్యక్తులకు ఇవ్వడం జరిగిందని అవే డబ్బులను తన అవసరం నిమిత్తం అడుగగా డబ్బులు తీసుకున్న సదరు వ్యక్తులు తనని బెదిరింపులకు పాల్పడమే కాకుండాతమ భయభ్రాంతులకు గురి చేసినారని దీనితో మనస్థాపానికి గురైన మధునన్న చేసిన రెక్కల కష్టం తన ఇంట్లో వాళ్లకు చెందకుండా పోతుందనే బాధతో డబ్బులు తీసుకున్న వారి పేరు మీద సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని ఈ ఆత్మహత్యకు కారకులైన వారిని వెంటనే అరెస్టు చేసి విచారించి చట్టపరమైన చర్యలు తీసుకుని నాయిని కుటుంబానికి న్యాయం చేయాలని రామగుండం ప్రెస్ క్లబ్ పక్షాన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు కొండ్రా అంజయ్య, మహంకాళి సంపత్, గుండారపు (వెన్నెల) శ్రీనివాస్, పూసల రవి, మామిడిపల్లి శ్రీనివాస్, పోతుల జాన్, మాతంగి శివరాజ్, తదితరులు పాల్గొన్నారు.

