అగ్నిధారన్యూస్ కరీంనగర్
గత పార్లమెంటు ఎన్నికల సమయంలో మానేరు డ్యామ్ నుంచి గన్నేరువరం వరకు బ్రిడ్జి నిర్మిస్తానని బండి సంజయ్ అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చి మార్చారని బ్రిడ్జి సాధన కమిటీ లీడర్లు సంపత్ ఉదయ్ కుమార్ ఆరోపించారు. మంగళవారం మైలారం నుండి మానేరు పరివాహ ప్రాంతం మైసమ్మ గుట్ట వరకు వివిధ గ్రామాల ప్రజలతో ర్యాలీగా వెళ్లి వంటావార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్రిడ్జి లేని కారణంగా సమయానికి వైద్యం అందని పరిస్థితి ఏర్పడిందన్నారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే గన్నేరువరం, ఇల్లంతకుంట ,బెజ్జంకి మండలాలకు చెందిన 100 గ్రామాల ప్రజలకు కరీంనగర్ దగ్గరవుతుందన్నారు. బ్రిడ్జి నిర్మిస్తానని చెప్పడంతో నమ్మి ఓటేశామని రెండుసార్లు ఎంపీగా గెలిచిన తర్వాత కూడా బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపట్టకపోవడం దారుణం అన్నారు. ప్రజల సౌకర్యం కొరకు వెంటనే బ్రిడ్జి నిర్మించాలని లేదంటే రాజీవ్ రహదారిపై మూడు మండలాల ప్రజలతో భారీ ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో
బ్రిడ్జి జేఏసీ అధ్యక్షులు సంపతి ఉదయ్ కుమార్, సిపిఐ కాంతాల అంజిరెడ్డి,మాజీ ఎంపీటీసీ పురంశెట్టి బాలయ్య,
రామచందర్రావు, మాజీ సర్పంచ్ జక్కనపల్లి సత్తయ్య,తోట రాజేశం,నూకల తిరుపతి, మర్రి వెంకట మల్లు, సుద్దాల రాయమల్లు,నూకల మల్లయ్య,నూకల చింటూ జక్కన్న పెళ్లి రాజకుమార్ వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


