అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ 

సుల్తానాబాద్ పట్టణంలోని చెరువు వద్ద పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులను చూసి తమ ద్విచక్ర వాహనాన్ని వదిలిపెట్టి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు పట్టుకొని తమదైన పద్ధతిలో విచారణ చేయగా పూర్తి వివరాలు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే శంకరపట్నం మండల కేంద్రంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన బద్దిపడిగే సంజీవరెడ్డి డ్రైవర్ గా పని చేస్తూ వచ్చిన సంపాదన సరిపోకపోవడంతో ఎలాగైనా అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలని దురాలోచనతో ఆయన బావ ఆయన రాజారామ్ అనే వ్యక్తి ప్రోద్బలంతో గంజాయిని విక్రయించడానికి అలవాటు పడ్డాడని అందులో భాగంగా ఈరోజు ఉదయము గోదావరిఖని నుండి తన ద్విచక్ర వాహనంలో గంజాయి బ్యాగులను అందులో తీసుకువస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గంజాయి సుమారుగా నాలుగు కిలోల వరకు ఉంటుందని దీని విలువ 98 వేల వరకు ఉంటుందని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సుల్తానాబాద్ ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు.