ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

అగ్నిధార న్యూస్ మంథని :

పెద్దపల్లి మండల కేంద్రంలో సోమవారం రోజు లైన్స్ క్లబ్ పెద్దపల్లి రంగనాయక ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ ఫోటోగ్రఫీ సందర్భాన్ని పురస్కరించుకొని లక్ష్మీ గణపతి హోటియా స్టూడియో నిర్వాహకులు లక్ష్మణ్ ను ఘనంగా సన్మానించారు. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఎంచుకున్న వృత్తిలోనే ప్రతిభను కనబరుస్తూ ఎన్ని అడ్డంకులు ఎదురైన నమ్ముకున్న ఫోటోగ్రఫీ వృత్తిలోనే నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్నందుకు గాను లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆయనతోపాటు మేఘన ఫోటో స్టూడియో నిర్వాహకులు దాసరి తిరుపతిని సన్మానించారు.