తప్పిన ప్రాణ నష్టం

 – లక్ష రూపాయల ఆస్తి నష్టం 

అగ్నిధార న్యూస్ మంథని :

ముత్తారం మండలం ఖమ్మంపల్లి నుంచి మంథని కి వస్తున్న కారు (టి ఎస్ 22జి 0959) సూరయ్యపల్లి మూలమలుపు వద్ద గల మంథని సాయి కి చెందిన క్షౌరశాలను ఢీ కొట్టింది.సెలూన్ షాప్ ను ఢీ కొట్టిన కారు పక్కనే గల అలోక్ స్కూల్ కు చెందిన బస్సును ఢీ కొట్టి ఆగిపోయింది.టేలాను ఢీకొట్టిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. కారు ఢీ కొట్టడంతో టేల పనికి రాకుండా పోయిందని యజమాని మంథని సాయి వివరించారు. కారు ఖమ్మంపల్లికి చెందిన రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి పెట్టం నారాయణ దిగా తెలిసిందని అన్నాడు. టేల దెబ్బ తినడంతో తనకు జీవనోపాధి లేకుండా పోయిందని,లక్ష రూపాయల ఆస్తి నష్టం జరిగిందని మంథని సాయి ఆవేదన వ్యక్తం చేశాడు.జరిగిన సంఘటనపై తాను పోలీసులను ఆశ్రయించనున్నట్లు తెలిపారు.