పెద్దపల్లి శాసనసభ్యులు విజయ రమణారావు.

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వినతిపత్రం.

అగ్నిధారన్యూస్, పెద్దపల్లిటౌన్:
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు పంపిణీకి కృషి చేస్తానని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు హామీ ఇచ్చారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్ ఆద్వర్యంలో జర్నలిస్టులు మంగళవారం ఎమ్మెల్యే విజయ రమణారావుకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. ప్రభుత్వ స్థలం గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టులకు న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ఇచ్చారు. అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్ల మంజూరుకు హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని జర్నలిస్టు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు.

ఎమ్మెల్యేకు జర్నలిస్టుల వినతి.

ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు మంగళవారం రోజు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చింతకింది చంద్రమొగిలి, నారాయణదాస్ అశోక్ మాట్లాడుతూ... వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ ఇండ్ల స్థలాలు, ఇండ్లు మంజూరు చేయాలని, ఇండ్ల నిర్మాణాలకు రూ. 15 లక్షలు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్ కు10 గుంటల ప్రభుత్వ స్థలం కేటాయించాలని, ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలన్నారు. పనిచేస్తున్న జర్నలిస్టులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా అక్రిడిటేషన్ కార్డులు వెంటనే జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలోని అన్ని కార్పోరేట్ ఆసుపత్రుల్లో రూ. 10లక్షల వరకు చెల్లుబాటు అయ్యేలా హెల్త్ కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు రాష్ట్రమంతా ఆర్టీసి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈకార్యక్రమంలో జర్నలిస్టులు ఎర్రోజు వేణుగోపాల్, గుడ్ల శ్రీనివాస్, లైసెట్టి రాజు, ప్రవీణ్ రెడ్డి, బెజ్జంకి నరేష్, గౌస్ పాషా, పులిపాక రామకృష్ణ, ఆరెల్లి మల్లేష్, రాజ శేఖర్, వీరమల్ల విద్యాసాగర్, సతీష్ రెడ్డి, శివ చారి, ఆకుల రమేష్, బోనాల నాగరాజు, చేగొండ రవి కుమార్, పంది కుమార్, కలవెన రాజేందర్, కృష్ణమూర్తి, నాగిశెట్టి శ్రీనివాస్, సాబీర్ పాషా, ఇబ్రహీం, తిరుపతి, అడిచెర్ల రమేష్, నగునూరి శ్రీనివాస్, పూరేళ్ళ శ్రావణ్, కొలిపాక కృష్ణ, జాపతి సంజీవ్, సాదిక్, తదితరులు పాల్గొన్నారు.