అగ్నిధారన్యూస్ కమాన్పూర్, సెప్టెంబర్ 1:

కమాన్ పూర్ మండలంలోని జూలపల్లి గ్రామంలోని శివారులో గల పంట పొలంలో ఆదివారం వ్యవసాయ వలస కూలీ ఇలాసారం కిరణ్ (37) మృతి చెందాడు. పొలం పనుల కోసం వెళ్ళగా అక్కడే సొమ్మ రావడంతో పంట పొలంలో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న కమాన్ పూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పోస్టు మార్టం కోసం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. కాగా ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ కు చెందిన కిరణ్ గత 20 సంవత్సరాలుగా జూలపల్లి గ్రామంలో రఘుపతి దగ్గర ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. గతంలో కూడా ఇతనికి సొమ్మ రోగం ఉండడంతో మందులు కూడా వాడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. కిరణ్ భార్య సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ కొట్టే ప్రశాంత్ తెలిపారు.