అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సుల్తానాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద బాణాసంచా పేల్చి కేక్ కట్ చేసి ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపెల్లి నియోజకవర్గ నాయకులు ఒజ్జ హరీష్ హరీష్ మాట్లాడుతూ.. రాబోయే రోజులలో మరిన్ని సేవా కార్యక్రమాలు ఉంటాయని నియోజకవర్గంలో భారీగా కురుస్తున్న వర్షాల వలన సేవా కార్యక్రమాలు రద్దుచేశామని త్వరలో రక్తదాన శిబిరాలు కూడా నిర్వహిస్తామని ఒజ్జహరీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు రాసూరి హరికృష్ణ, పోతర్ల వివేక్, పోగుల పవన్, సిర్ర సాయి, కాంపల్లి వినయ్, పెరుగు ప్రవీణ్, మహేందర్,రంజిత్, జయంత్ తదితరులు పాల్గొన్నారు,
