ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు.
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి జిల్లా//అంతర్గాo, సెప్టెంబర్ -03:
జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని .అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు .
మంగళవారం రోజున రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ , పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ల తో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఎగువ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారుతుందని, ముంపు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.ఎల్లంపల్లి ప్రాజెక్టు సామ్యర్థం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో తీరును పరిశీలించి, ప్రజలను అప్రమత్తం చేస్తూ , అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు.
ఎస్ ఆర్ ఎస్ పి , కడెం ప్రాజెక్టుల నుండి పెద్దఎత్తున వరద ప్రవాహం ఎల్లంపల్లి కి రావడంతో 33 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.
జిల్లాలోని వివిధ నీటిపారుదల ప్రాజెక్టులకు వరద వచ్చే నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని , రెవెన్యూ పోలీస్ మున్సిపల్ , నీటిపారుదల శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
ఈ పర్యటనలో రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.


