– తీవ్రంగా గాయపడిన చిన్నారులు.
– మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
అగ్నిధార న్యూస్ మంథని :
వీధి కుక్కల దాడులు రోజు రోజుకు పెరిగి పోతున్న అధికారులు మాత్రం ఎటువంటి జాగ్రత్త పరమైన చర్యలను తీసుకోవడం లేరు.ప్రతి గ్రామంలో కూడా వీధి కుక్కలు ప్రజలపై ,తెల్లవారు లేసి ఆటలాడుకునే చిన్నారిపై దాడులు చేస్తున్న కుక్కల దాడులకు ముగింపు పెట్టె చర్యలు ఎక్కడ కనిపించటం లేదు.కాగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం స్వర్ణపల్లి గ్రామంలో శనివారం రోజు ఉదయం ఇంటి ముందు ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులపై నలుబోతుల మానస శ్రీ (5), కొరవేన వేదన్ష్ (3) వీధి కుక్కలు దాడి చేశాయి. దాడిలో తీవ్ర గాయాలు అయిన చిన్నారులను మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఇప్పటికైనా ఆధికార యంత్రాంగం నిద్రనుండి మేల్కొని గ్రామాలలో , పట్టణాలలో ప్రజల , చిన్నారులపై జరిగే కుక్కల దాడులు మళ్ళీ జరగకుండా తక్షణమే నివారణ చర్యలు చేపట్టి వీధి కుక్కల దాడుల బారి నుండి తమ ప్రాణాలను కాపాడాలని అధికారులను వేడుకుంటున్నారు.


