అగ్నిధారన్యూస్, బెల్లంపల్లి:
బెల్లంపల్లి పట్టణం కాంటా చౌరస్తాలో 7 కోట్ల 58 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ నీతో కలిసి బెల్లంపల్లి కూరగాయల మార్కెట్ ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ..ఎన్నికల్లో కూరగాయల మార్కెట్ కావాలని స్థానికులు అడిగారు.ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్ని నెరవేరుస్తామనీ హామీ ఇచ్చాననీ వానకు,ఎండలకు రోడ్ల పైన కూరగాయలు అమ్ముకుంటూ వ్యాపారులకు ఇబ్బందులు ఇప్పుడు ఉండవనీ కూరగాయల మార్కెట్ ప్రారంభించడం ఆనందంగా ఉందనీ గతం లో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు సోలార్ తోపుడు బండ్లు పంపిణీ చేశామనీఎవరికైనా ఇబ్బందులు కలిగితే విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తామనీ ఎంపీ నిధుల నుండి బెల్లంపల్లికి కావాల్సిన సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ ముందుంటామనీ ఆయన తెలిపారు.
