కేటీఆర్ ను విమర్శించే అర్హత ఎమ్మెల్యేగా లేదు.

బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కే.టీ.ఆర్ ని విమర్శించే నైతిక హక్కు మాక్కాన్ సింగ్ లేదు.
= పదేళ్ల కేసీఆర్‌ పాలన సింగరేణి లో స్వర్ణయుగం.
= సింగరేణి కార్మికులకు నికర లాభంలో 33 శాతం చేల్లించాలి.
= రామగుండం మాజీ. శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్.

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి జిల్లా:
సింగరేణి కార్మికులకు సంస్ద నికర లాభంలో 33 శాతం చెల్లిస్తామని డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క ప్రకటించించిన విధంగా కార్మికులకు చెల్లించాలని కేటీఆర్ మాట్లాడితే, రామగుండం స్థానిక శాసనసభ్యుడు మాక్కాన్ సింగ్,చేసిన విమర్శలను బిఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూన్నమని కేటీఆర్ ని విమర్శించే స్దాయు గాని నైతిల హక్కు మాక్కాన్ సింగ్ కు లేదని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్  అన్నారు. బుధవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఎర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. నందమూరి బాలకృష్ణను మరిపించే విధంగా తట్ట చెమ్మస్ తోని కార్మికుల డ్రెస్ తో అసెంబ్లీ లోకి వెళ్లిన మాక్కాన్ సింగ్ సింగరేణి కార్మికుల పట్ల గాని వారి సంక్షేమం కోసం పట్టింపులేదన్నారు. చంద్రబాబు నాయుడు హాయంలో సింగరేణి లో వారసత్వ ఉద్యోగాలను తీసేస్తే వాటి కొనసాగింపు కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్ చేశారన్నారు. పదేళ్ల కేసీఆర్‌ పాలన సింగరేణి కి సర్ణయుగమని సంక్షేమంతో పాటు సింగరేణిలో విప్లవాత్మకమైనమార్పులు తీసుకు రావడం ద్వారా సింగరేణి అద్బుతమైన ప్రగతి సాధించిందన్నారు. సింగరేణి లాభాలు గణనీయంగా పెరగడంతో వాటికి అనుగుణంగా కార్మికులు లాభాల వాట పెంచుతూ కార్మిక పక్షపాతిగా కేసీఆర్‌ నిలిచారన్నారు.వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించారని 19వేల మంది సింగరేణి కార్మికుల వారసులకు ఉద్యోగ అవకాశాలను కల్పించిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. సింగరేణి కార్మికుల తల్లిదండ్రులు వైద్యసదుపాయంతో పాటు ఇళ్ల నిర్మాణానికి కార్మికులకు 10 లక్షల రుణాలు అందిచారన్నారు. ఇక్కడ ఎమ్మెల్యేకు కార్మిక ఉద్యమాలు అంటే తెలియవనీ, ఏ కార్మిక ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర లేదన్నారు. స్వయంగా కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియా సమావేశంలో సింగరేణి నికర లాభాన్ని ప్రకటించారని, ప్రకటించిన విధంగా సింగరేణి కార్మికులకు 33 శాతం లాభాలను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణిలో వచ్చిన లాభాలను కార్మికులకు చెల్లించకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్మికులను మోసం చేస్తుందని విమర్శించారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన లాభాల వాటాపై కార్మికులు చీదరించుకుంటున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.లాభాల వాట 33 శాతం చేల్లించాలని ధర్నాలు చేస్తున్న టిబిజికఏస్ నాయకులపై కేసులు పేడుతున్నరన్నారు. ఎన్ని కేసులు పెట్టినా బెదిరేది లేదని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో వందలాది కేసులను ఎదుర్కొని జైలు కు వేళ్లిన చరిత్ర తమదన్నారు. సింగరేణి కార్మికులకు 33 శాతం లాభాల వాట ప్రభుత్వం చేల్లించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు పాముకుంట్ల భాస్కర్, కల్వచర్ల కృష్ణ, వేణీ బాదె, అంజలి దేవి, గాధం విజయ, నాయకులు నడిపెల్లి మురళీధర్ రావు, మేతుకు దేవరాజ్, నూతి తిరుపతి, చల్లగురుల మెగిళి, బోడ్డుపల్లి శ్రీనివాస్, ఆడప శ్రీనివాస్, జహిద్ పాషా, పీచర శ్రీనివాస్, ఇంజపురి నవీన్, కోల సంతోష్ గౌడ్, రాజేశం, యసర్ల తిమెాతి, కౌటం బాబు, జడ్సన్, జిట్టవేని ప్రశాంత్ కుమార్, సందెల మల్లయ్య, ధర్మాజీ కృష్ణ, ముద్దాసాని సంధ్యా రెడ్డి, సట్టు శ్రీనివాస్, ఇరుగురాల్ల శ్రావణ్, చింటూ, వడ్లూరి రాములు స్నప్న, ఆవునూరి వెంకటేష్, కర్రి ఓదేలు, లక్ష్మి, రమాదేవి,
తదితరులు పాల్గొన్నారు.