యాదవుల ఇష్టకుల దైవం ఓదెల మల్లికార్జున స్వామి.

చైర్మన్ పదవి యాదవులకే కేటాయించాలి.

సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే.

అగ్నిధారన్యూస్, పెద్దపల్లిజిల్లా:
శనివారం రోజు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం, ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో ఆలయ చైర్మన్ మేకల మల్లేశం యాదవ్… ఆధ్వర్యంలో పలు అభివృద్ధి ప్రారంభోత్సవ కార్యక్రమాలకు పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో దాతల సహాయ సహకారాలతో యాదవ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో, యాత్రికుల అతిథి గృహ సముదాయమును యాదవ సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా యాదవ సంఘం సంఘ నాయకులు ఎమ్మెల్యేతో మాట్లాడుతూ, రానున్న రోజుల్లో ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ పాలకవర్గానికి చైర్మన్ గా మళ్లీ యాదవులకే అవకాశం కల్పించాలని అఖిల భారత యాదవ మహాసభ పెద్దపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సందనవేని రాజేందర్ యాదవ్ ఆధ్వర్యంలో..యాదవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు మారం తిరుపతి యాదవ్, ప్రధాన కార్యదర్శి గొడుగు రాజ్ కుమార్ యాదవ్, గొర్రెల పెంపకందారుల యూనియన్ మాజీ చైర్మన్ తమ్మడబోయిన ఓదెలు యాదవ్ లు వినతి పత్రం ఇచ్చారు.పెద్దపల్లి జిల్లాలో అత్యధిక జనాభా కలిగిన కులముగా యాదవులం ఉన్నామన్నారు. శ్రీ భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి దేవాలయం, ఓదెల ఆలయ ప్రస్థానం మొదలైనప్పటి నుండి యాదవులకు మొదటిసారి 2022 సంవత్సరంలో అఖిల భారత యాదవ మహాసభ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మేకల మల్లేశం యాదవ్ కి చైర్మన్, నలుగురికి డైరెక్టర్ పదవుల అవకాశం రావడం జరిగిందని అన్నారు. చైర్మన్ పదవి చేపట్టిన అనతి కాలంలోనే పాలకవర్గ సహకారంతో వీరభద్ర స్వామి గుడి, బంగారు పోచమ్మ గుడి, మదన పోచమ్మ గుడి స్వామివారి కోనేరులను నిర్మాణం చేసి ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు. మహిళ భక్తుల ఇబ్బందులను చూసి తక్షణమే టాయిలెట్స్ ను పునర్ నిర్మాణం చేపట్టామన్నారు, అలాగే మదన పోచమ్మ దేవాలయ ప్రహరీ గోడ, విఐపి అతిథిగృహo యాత్రికుల అతిథి గృహ సముదాయ నిర్మాణాలు ప్రారంభోత్సవ దశలో ఉన్నాయని అన్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి ఆలయ అభివృద్ధికి, యాదవ బిడ్డ సంకల్ప దీక్ష, ఇష్టకుల దైవమైన శ్రీ మల్లికార్జున స్వామి ఆశీర్వాదంతో పూర్తి చేస్తూ, భవిష్యత్తు అవసరాల నిమిత్తం 20 లక్షల నిధులతో అధనాతన టాయిలెట్స్, 47 లక్షల నిధులతో స్వామివారి రథo, ఒక కోటి రూపాయల నిధులతో రెండు యాత్రికుల షెడ్లలను నిర్మించుటకు పూర్తి పరిపాలన అనుమతులను పొందియున్నారని అన్నారు. అలాగే మల్లికార్జున స్వామి ఆలయ మాస్టర్ ప్లాన్ లో భాగంగా రాజ ప్రాకారాలు రాజగోపురాల నిర్మాణానికై 10 కోట్ల రూపాయల నిధులు అవసరం ఉన్నదని, ఇట్టి విషయమై మాజీ ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు.గుడి ఆవరణ స్థలం ఆక్రమణకు గురికాగా, రెవెన్యూశాఖతో సర్వే చేయించి తిరిగి గుడి వాస్తవిక స్థలoను మల్లన్న దేవుని ఆశీర్వాదంతో సాధించుకున్నామని అన్నారు. ఇట్టి అభివృద్ధి పనులు నడిపించడంలో ఎన్నో ఇబ్బందులు , ఎన్నికల ఎన్నికల కోడ్లతో అతి తక్కువ సమయంలో పాలకవర్గ, ధర్మకర్తల సహాయ, సహకారాలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని. భవిష్యత్తులో ఎమ్మెల్యేగా మీ సహాయ సహకారాలతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు, యాదవులు అంకుటిత దీక్షాపరులు, కుల ఇష్టదైవ సేవలో మరల చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీ పరిశీలనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులైన యాదవులకు అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో కాల్వ శ్రీరాంపూర్ మండల యాదవ సంఘం అధ్యక్షులు గాజనవేణి సదయ్య యాదవ్, తాత రాజు యాదవ్, అసరి రమేష్ యాదవ్, విద్యార్థి సంఘ నాయకుడు కూకట్ల నవీన్ యాదవ్ డైరెక్టర్ మల్లేష్ యాదవ్, రామచంద్ర యాదవ్, సంపత్ యాదవ్, గట్టయ్య యాదవ్, గట్టు యాదవ్, అజయ్ యాదవ్, యాదవ సంఘం నాయకులు, యాదవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.