కార్యాలయ మెట్లపై బుట్ట దాఖలైన రికార్డులు.

రికార్డుల నిర్వహణలో భద్రత ఏది..?

ప్రమాదకరంగా విద్యుత్ మీటర్.

పట్టించుకోని డి ఆర్ డి ఓ అధికారులు.

అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా ) పెద్దపల్లిజిల్లా కేంద్రంలోని పాత డి ఆర్ డి ఓ కార్యాలయంలో దాదాపు ఆరు సంవత్సరాల సంవత్సరాల జిల్లా గ్రామీణ అభివృద్ధి కార్యాలయ రికార్డ్స్ , మహిళా సంఘాల ఆడిట్ రిపోర్ట్ లు ఆ కార్యాలయం ఆవరణ ప్రవేశం మొదలుకొని పై అంతస్తు వరకు గుట్టలు గుట్టలుగా మెట్ల పైన పడేసిన రికార్డ్స్,చెత్త కుప్పను తలపించే విధంగా కనబడతాయి. అయినా అధికారులకి అవేవి కనిపించడం లేదు అన్నట్లు ప్రవర్తిస్తున్న తీరు చూస్తే విస్మయాన్ని కలిగిస్తుంది.

పూర్తి వివరాలు… పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో…. కొత్తగా పెద్దపల్లి జిల్లా ఏర్పడ్డాక, వివిధ శాఖల కార్యాలయాలను ఏర్పాటు చేశారు. వాటితోపాటు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కార్యాలయం దాదాపు ఆరు సంవత్సరాలు కొనసాగించారు.( పాత ) అనంతరం జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యాలయాన్ని రెండు సంవత్సరాల క్రితం నూతనంగా నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్, సముదాయంలోకి మార్చబడింది.
ఆ సమయంలో నిర్వహించబడిన దాదాపు ఆరు సంవత్సరాల అధికారిక కార్యక్రమాలన్నీ రికార్డు నిర్వహణ రూపంలో జిల్లాలోని మండలాలకు సంబంధించిన మహిళా సమాఖ్య, రికార్డులు, ఫైలింగ్ ఆడిట్ చేసిన రిపోర్ట్స్ గత రెండు సంవత్సరాల కాలంగా, నిర్లక్ష్యంగా పాత డి ఆర్ డి ఓ ఆఫీస్ కార్యాలయ మెట్ల పైన గుట్టలు గుట్టలుగా పడేసిన రికార్డ్స్ వాటిని పట్టించుకునే అధికారులే కరువయ్యారు. అదే కార్యాలయంలో ఇప్పుడు మండల మహిళా సమైక్య కార్యాలయం, పైన మండల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్యాలయ నిర్వహణ జరుగుతుంది. ఆయా కార్యాలయాలకు ఆ శాఖల అధికారులతో పాటు, నిత్యం ప్రజలు ప్రజా ప్రతినిధులు నాయకులు వస్తూపోతుంటారు, ఆ పక్కనే రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా, ప్రయోగాత్మకంగా, టాస్క్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాలకి నిత్యం జిల్లాస్థాయి అధికారులు ఎవరో ఒకరు వస్తువు పోతూ ఉంటారు. అయినా వారికి అవేమి మాకు పట్టవన్నట్లు, చూసి చూడనట్లు, సంబంధం లేనట్లు, వ్యవహరిస్తున్న తీరు బాధాకరం. ప్రతి పక్షం రోజులకు ఒకసారి చెత్తగా పడేసిన రికార్డుల పక్కనే జిల్లా స్థాయి మహిళ సమావేశాలు జరుగుతాయి ఆ సమావేశాలకి ఆ శాఖ జిల్లా ఉన్నతాధికారులు వస్తూ ఉంటారు. అయినా పక్కనే ఉన్న రికార్డ్స్ ని పట్టించుకున్న వారే లేరు. కార్యాలయ పై అంతస్తులోని ఉపాధి హామీ కార్యాలయాన్ని సందర్శించే వారికి మొదటి అంతస్తు నుండి పై అంతస్తు కు వెళ్లే వరకు చెత్తతో స్వాగతం పలుకుతూ, కార్యాలయ దర్శనమవుతుంది రాష్ట్రంలోనే కాదు పెద్దపల్లి జిల్లా దేశంలోనే… పారిశుద్ధ్యంలో అవార్డులు తెప్పించిన ఘనతమాదని చెప్పుకునే అధికారుల కార్యాలయాలలోనే పారిశుద్ధ్య పరిరక్షణ ఎక్కడ అని కార్యాలయాలకు వచ్చి పోయేవారు ప్రశ్నిస్తున్నారు.

నిరుపయోగంగా ఉపాధి హామీ మాస్టర్ రోల్స్.

గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఉపాధి హామీ కూలీల హరితహారం, హాజరు పట్టికలు కుప్పలు, కుప్పలుగా కట్టలు విప్పకుండానే పడివేశారు. లక్షలాది రూపాయల విలువ చేసే మాస్టర్ రోల్స్ పనికి రాకుండా పోయాయి. దీనికి బాధ్యులైన అధికారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు అంటున్నారు. ఐకెపి
రికార్డ్స్ ను అలా నిర్లక్ష్యంగా పడి వేయడం ద్వారా అందులో ఉన్న రికార్డ్స్లు మిస్ అయినట్లు అయితే దానికి బాధ్యత వహించేది ఎవరు? ఆడిట్ పూర్తి అయ్యాక ఆ రికార్డ్స్ తో అవసరం లేదు అనుకున్నట్లయితే,ప్రత్యేకమైన గదిలో భద్ర పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్యoలో భాగంగా స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాలు చేపడతా ఉంటే జిల్లా ప్రధాన కేంద్రంలో అపరిశుభ్రత రాజ్యమేలుతుంది.

ఎలర్జిటిక్ లంగ్స్ డిసీజెస్ , చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు.

సంవత్సరాలుగా నిల్వ ఉంచిన కాగితాల ద్వారా ఎలర్జిటిక్ లంగ్స్ డిసీజెస్ , చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయంలో పనిచేసేవారు, అవసరాల కోసం వచ్చి పోయే వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా ఆ శాఖ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి అటువైపు దృష్టి సాధించి రికార్డులను భద్రపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రమాదకరంగా విద్యుత్ మీటర్.

రికార్డ్స్ ను ఆనుకొని విద్యుత్ మీటర్ ఉండడం చేత ఎప్పుడైనా విద్యుత్ ప్రమాదం జరిగే అవకాశం లేకపోతే. ఇప్పటికైనా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం మరి.

oplus_0
oplus_32
oplus_32