అగ్నిధార న్యూస్ ,సుల్తానాబాద్:
గంజాయి సరఫరా చేసే నిందితుడు అరెస్ట్
*1కిలో గంజాయి స్వాధీనం*
గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో గోదావరిఖని ఏసిపి గిరిప్రసాద్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుడి అరెస్ట్ వివరాలు వెల్లడించారు
నిందితుడు *దేవోజి వేణు* అనే యువకున్నీ నమ్మదగిన సమాచారం మేరకు *తేదీ: 27.10.2021 బుధవారం రోజున గోదావరిఖని రాంనగర్ రైల్వే పట్టాల వద్ద* గంజాయి అమ్ముకోవడం కోసం అక్కడ ఉండగా ఎస్సై ఉమాసాగర్ తన సిబ్బందితో వెళ్లి పట్టుకున్నారు అతనిని తనిఖీ చేయగా తన వద్ద *1కిలో గంజాయి దొరికినది.* వెంటనే సీఐ గారికి విషయం తెలిపగా రామగుండం ఎమ్మార్వో రమేష్ గారికి సమాచారం అందించగా ఎమ్మార్వో అందుబాటులో లేనందున డిప్యూటీ ఎమ్మార్వో బత్తిని కిరణ్ పంపించడం జరిగింది. డిప్యూటీ ఎమ్మార్వో కిరణ్ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి అనంతరం అతన్ని స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు
*నిందితుని వివరాలు*
1 దేవోజి వేణు S/o సదానందం, వయస్సు: 21, కులం, SC మాదిగ r/o రాంనగర్, గోదావరిఖని.
పట్టుకున్న సొత్తు:*
1కిలో గంజాయి
నిందితున్ని పట్టుకున్న CI’s G రమేష్ బాబు , S రాజ్ కుమార్ గౌడ్ , ఎస్సై ఉమాసాగర్, ఏ ఎస్సై మల్లయ్య, కానిస్టేబుల్స్ హేమసుందర్, తీట్ల శ్రీనివాస్, గోపతి వెంకటేష్ , HG శేఖర్ లను ఏసిపి గిరి ప్రసాద్ అభినందించారు.యువత ఎక్కువగా గంజాయికి బానిస అయి ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటూ మరియు నేరాలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు తమ తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వారి కదలికలను మరియు వారి ప్రవర్తనను నిశితంగా గమనించాలన్నారు ముఖ్యంగా వారు ఎవరితో స్నేహం చేస్తూ ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారో వారందరి పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలి. గంజాయి గురించి ఎలాంటి సమాచారం ఉన్న డయల్ 100 కి గాని, నేరుగా మాకు గాని సమాచారం ఇచ్చి యువతను చెడు మార్గం వైపు వెళ్లకుండా సహకరించగలరు అన్నారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడును.గంజాయి అమ్మిన లేదా కొన్న లేదా సేవించిన వారి పై చట్టరీత్య కఠినచర్యలు తీసుకోబడతాయి అన్నారు
