వివరాలు వెల్లడించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి,
అగ్నిధారన్యూస్ మందమర్రి.
ఈ నెల 17,18వ తేదీలలో జరగనున్న గ్రూప్ 3 పరీక్షల దృష్ట్యా మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఎగ్జామినేషన్ సెంటర్ లను మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి, స్థానిక ఎస్సై రాజశేఖర్ తో కలిసి, సందర్శించడం జరిగింది. గ్రూప్ 3 పరీక్షలు రాయబోయే విద్యార్థులు ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా.. ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష సమయాన్ని ఉపయోగించుకోవాలని,నిర్దేశించిన సమయానికే పరీక్ష రాసే అర్హులైనవారు పరీక్ష కేంద్రం వద్దకు రావాలని, పరీక్ష రాసే కేంద్రం వద్ద పోలీస్ కట్టుదిట్టమైన బందోబస్తు ఉంటుందని,పోలీస్ అధికారులు తెలిపారు. మందమర్రిలో మొత్తం 7 సెంటర్లు పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల మొత్తం సంఖ్య 2,065 తెలిపారు.
