అగ్ని ధార న్యూస్ (కల్వకుర్తి) 

వెల్దండ మండలం ఎంజీ కాలనీ తండాకు చెందిన రాత్లావత్ రాజు(30) ఈనెల 8న తన వ్యవసాయ పొలంలో హత్యకు గురయ్యారు. ఘటనపై మంగళవారం నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ రఘునాథ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ,ఎంజి కాలనీ తండాకు చెందిన రాత్లావత్ రాజు అతని భార్య హిమబిందుకు 9 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు కూతురు ఉంది. గత సంవత్సర క్రితం మృతుడి భార్య హిమబిందుకు మహేశ్వరం నియోజకవర్గం కళ్లెం చెరువు తండాకు చెందిన చంటితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అతనితో తరచూ ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. ఈ క్రమంలో ఈనెల ఏడవ తారీఖు రోజు మృతుడు రాజుకు తెలియడంతో ఇద్దరినీ మందలించాడు. మృతుడి భార్య హిమబిందు ప్రియుడు చంటి తో కలిసి ఎలాగైనా రాజును చంపి అడ్డు తొలగించుకోవాలని పథకం వేశారు. చంటి అతని స్నేహితుడైన కుర్ర రాకేష్ కు అతనికి సహకరించాలని కోరాడు.