అగ్నిధార(రామగిరి మండలం)
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బేగంపేట గ్రామంలోని తపాలా శాఖలో జరిగిన నకిలీ పాసు పుస్తకాల వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు. బేగంపేట గ్రామ బి.పి.ఎం గా పనిచేసిన మెండ హేమ 54 మంది ఖాతాదారులకు చెందిన 34 లక్షల 87వేల 22 రూపాయలు కాజేసిందని పోస్టల్ ఇన్స్ పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి మంగళవారం రాత్రి రామగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.ఇంకా ఎవరైనా ఉంటే బాధితులు ముందుకు రావాలని నకిలీ పాసు పుస్తకాలతో పాటుగా గల్లంతైన నగదు పై లోతైన విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేస్తామని మంథని సీఐ బొల్లంపల్లి రాజు గౌడ్ తెలిపారు.సిఐ వెంట రామగిరి ఎస్సై పెట్టం చంద్రకుమార్ ఉన్నారు.
