తరలివచ్చిన భక్తజనం.

స్వామివారినిదర్శించుకున్న ఎమ్మెల్యేలు ముఖ్యులు. 

 ఈవో శంకర్ ఆధ్వర్యంలో ముఖ్యులకు పూర్ణకుంభాలతో స్వాగతం.

 సౌకర్యాలు కల్పించిన ఆలయ చైర్మన్ కమిటీ సభ్యులు.

పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ.

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలంలోని దేవుని పల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవాలు గత వారం రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో జరిగే జాతరకు ఇతర రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఆంద్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల నుండి భారీగా జనం తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. భక్తులందరూ స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం 

భారీగా తరలివచ్చిన భక్తజనంతో అందుగులపల్లి ప్రధాన రహదారి మొదలుకొని దేవరపల్లి జాతర వరకు కిక్కిరిసిన జనంతో, భక్తి పరవశంతో, దేవునిపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు, జాతర ప్రాంగణమంతా కిక్కిరిసిన భక్త జనంతో కిటకిటలాడింది. తరలివచ్చిన భారీ జన సమూహానికి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి అంతరాయం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

స్వామి వారిని దర్శించుకున్న శాసనసభ్యులు …

లక్ష్మీ నృసింహస్వామి ఆలయ కార్యనిర్వాహక అధికారి శంకర్, అర్చకులు లక్ష్మీనరసింహా, శ్రీకాంత్ చార్యులు స్థానిక పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావుకు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆలయంలో అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఆలయ కమిటీ చైర్మన్ సదానందం, సభ్యులు ఘనంగా శాలువాలతో సన్మానించారు. అదేవిధంగా చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామినీ, అర్చకులు పూర్ణకుంభం సుస్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ముద్దసాని శంకర్, ఆలయ అర్చకులు, ఆలయ డైరెక్టర్లు, కమిటీ సభ్యులు, బొక్కల సంతోష్, తలారి సాగర్, శ్రీపతి సుమన్, , బూతగడ్డ సంపత్,నూగుళ్ళ మల్లయ్య, బోడ్డుపల్లి శ్రీనివాస్, చిటి అశోక్, గొడ్డేటి రాజయ్య, చంద్రయ్య, గౌస్, గట్టయ్య,గంట రమేష్, అడేపు వెంకటేష్, వెంకటేష్, అనిల్, కుమార్ భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

జాతర లో పటిష్ట బందోస్తు..

ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు, ప్రాంగణమంతా పోలీస్ బందోస్తు మధ్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ ఆధ్వర్యంలో జాతరలో పటిష్ట బందోబస్తు నిర్వహించారు.సి ఐ లు ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ సి ఐ అనిల్ కుమార్ పర్యవేక్షణలో, ఎస్ ఐ లు రాజేష్, స్వామి, శ్రీనివాస్, లక్ష్మణ్ మహిళా ఎస్ ఐ లు మౌనిక ఆధ్వర్యంలో భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా విధులు నిర్వహించారు.