– ఆగని అక్రమ ఇసుక దందా
– అధికలోడుతో దర్జాగా ధనార్జన
– ప్రభుత్వ ఆదాయానికి గండి
– అధికారుల సహకారంపై అనుమానాలు..?
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి
పెద్దపల్లిజిల్లా బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో అధిక లోడుతో అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను పెద్దపల్లి మైనింగ్ శాఖ ఏడి శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఆ శాఖ అధికారిని టి ఏ రేణుక ఎస్ ఆర్ ఓ లు 5 ఇసుక లారీలను గురువారం రోజు తనిఖీలు చేపట్టి సీజ్ చేసి పెద్దపల్లి ఆర్టీవో కార్యాలయానికి తరలించారు. అనంతరం పెద్దపల్లి ఎం వి ఐ కి అప్పగించారు. గత వారం రోజుల క్రితమే విజిలెన్స్ అధికారులు దాదాపు పది అక్రమ ఇసుక లారీలను ( అనుమతులకు మించిన) పట్టుకుని సీజ్ చేసినప్పటికీ అక్రమార్కుల, వక్రబుద్ధి, మారడం లేదు. యదేచ్చగా అనుమతులకు మించి ఇసుకను దర్జాగా లారీల ద్వారా హైదరాబాదుకు తరలిస్తా, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అధికారులు తనిఖీలు చేస్తూ లారీలను సీజ్ చేసి ఆర్టీవో అధికారులకు అప్పగించినప్పటికీ, అక్రమార్కుల్లో ఎలాంటి భయం లేదు, అంటే అందులో ఉన్న మర్మమేంటో, ఆలోచించాల్సిన విషయమే.



