సభ్య సమాజం తలదించుకునేలా విద్యార్థుల ప్రవర్తన.
ఎటు పోతోంది నేటి యువత! ఆవుల రాజేష్ యాదవ్.
టి పి టి ఎఫ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు.
*అగ్నిదారన్యూస్ గోదావరిఖని*
బుధవారం రోజు రాయచోటి లోని కొత్తపల్లి జెడ్ పి హెచ్ ఎస్ ఉర్దూ మీడియం పాఠశాలలో విద్యార్థుల మద్య జరుగుతున్న ఘర్షణ ఆపిన ఉపాధ్యాయుడు.ఇద్దరు అన్నదమ్ములు మరొక విద్యార్థి కలిసి ఇతర విద్యార్థుల మీద దౌర్జన్యం చేసిన సందర్భంలో వారిని అడ్డుకున్న ఉపాధ్యాయుడిని ఒక్కసారిగా ఉపాధ్యాయుడి పై ఆ ముగ్గురు పిడిగుద్దులతో చెస్ట్ మీద , ముఖం మీద దాడికి పాల్పడటంతో కళ్ళద్దాలు కూడా విరిగిపోయిన పరిస్థితులలో మిగిలిన విద్యార్థులు విడిపించగా తీవ్ర ఆవేదనలో ఒక్కసారిగాకుప్పకూలిపోయిన ఉపాధ్యాయుడు.వెంటనే ఆసుపత్రిలో చేర్చిన తోటి ఉపాధ్యాయులు.కాసేపటికే ప్రాణాలు కోల్పోయిన హృదయ విషాదకర, విచారకరమైన ఈ సంఘటనను ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఉపాధ్యాయ సమాజం విశ్లేసించుకోవాలి. ఈ సంఘటనపై తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఆవుల రాజేష్ యాదవ్ మాట్లాడుతూ… ఇలాంటి సంఘటనలు మన మరలా పునరావతం కాకుండా చూసుకోవాలని ఉపాధ్యాయులకు రక్షణలో భాగంగా ఒక జీవోను విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో కోరారు ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరమని సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన విద్యార్థుల పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ మృతి చెందిన ఉపాధ్యాయ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని పెద్దపల్లి జిల్లా పక్షాన తెలియజేస్తూ వారికి వారి కుటుంబ సభ్యులకు మనోధర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని వేడుకున్నాను ప్రతి ఒక్క తల్లిదండ్రులు వారి పిల్లల మానసిక స్థితిపై దృష్టి సారించాలని పిల్లల భవిష్యత్తును నాశనం చేసుకోకుండా తల్లిదండ్రులు చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
