అగ్నిధారన్యూస్ పెద్దపల్లి:
కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం యూత్ కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా పెద్దపల్లి పట్టణానికి చెందిన బొంకూరి అవినాష్ భారీ మెజార్టీతో ఎన్నికయ్యారు. ఆన్ లైన్ పద్ధతిలో ఇటీవల నిర్వహించిన యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో జిల్లా అధ్యక్ష పదవికి బొంకూరి అవినాష్ పోటీ చేయగా, 7011 ఓట్ల భారీ మెజారిటీతో అధ్యక్షునిగా గెలుపొందారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకి, పెద్దపల్లి mla విజయరామణారావు కి జిల్లా పార్టీ అధ్యక్షులు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ కి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ గారికి, మినిమం వెజ్ బోర్డ్ చైర్మన్ జనక్ ప్రసాద్ కి , పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కి , దుద్దిల్ల శీను బాబు కుఅవినాష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అవినాష్ ఎన్నిక పట్ల పెద్దపల్లి జిల్లాలోని కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
