*100 రోజుల గ్యారంటీ నుంచి 365 రోజుల గారడి*
*ప్రశ్నిస్తే కేసులు – నిలదీస్తే అరెస్టులు*
*కేసులు మాకు – కాసులు మిక*
*బీఆర్ఎస్ పార్టీ జిల్లా సోషల్ మీడియా నాయకులు మజర్*
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి
గత 10 ఏండ్లు అద్భుతంగా అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రం ఏడాదిలోనే వెనక్కి నెట్టేయబడింది. తెలంగాణ రాష్ట్రం మోస పోయి చీకటి రాజ్యం చేతిలోకి వెళ్లి నేటికి ఏడాది పూర్తయిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా సోషల్ మీడియా నాయకులు మజర్ అన్నారు. ఇచ్చిన హామీలు అయితే దేవుడెరుగు అని కనీసం పాత పథకాలు కూడా అందించలేని అసమర్థ ముఖ్యమంత్రి ఉండడం బాధాకరమని అన్నారు. కేసీఆర్ చెప్పిన విధంగానే రైతుబంధుకు రాంరాం దళితబందుకు జైభీం తులం బంగారం తావు లేదు కేసీఆర్ కిట్ కానస్తలేదు కరెంట్ కాట కలిసింది బిసి బంధు బందయింది మైనార్టీ బంధు మరచిండు ఉచిత కరెంట్ ఉదహరణ కోసమే ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ దగ్గరే ఉండిపోయింది.4000 పెన్షన్ నో ఇంప్లిమెంట్ ఇలా 420 హామీలు అన్ని రేవంత్ రెడ్డి మాటలకే పరిమితమయ్యాయి. 100 రోజుల్లో అమలవుతుంది ప్రతీ గ్యారంటీ అని పేపర్ ప్రకటనలకే తప్ప అమలు కాలేదు. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేసి ప్రజా వ్యవస్థను ఖుని చేస్తున్నారు. పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టులు చేయడం, గురుకుల విద్యార్థుల అవస్థలను పరిశీలిస్తే కేసులు ప్రతీ మాటపై కేసులు మాకు కాసులు రేవంత్ రెడ్డికి సరిపోయాయని అన్నారు.
