Oplus_131072

నలుగురు మృతి.

అగ్నిదారన్యూస్:ఎండపల్లి 

జగిత్యాల జిల్లా  మల్యాల మండలంలోని కొండగట్టు లో కొత్త కార్ పూజ కోసం వచ్చి వెళుతున్న కారు,పల్నాడు జిల్లాలో ఆదివారం రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో చెట్టును ఓ కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి గాయాల య్యాయి. దీనిపై స్థానికులు పోలీ సులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను చికిత్స నిమిత్తం పిడుగు రాళ్ల ఆసుపత్రికి తరలిం చారు.మృతులు నెల్లూరు జిల్లా కావలి మండలం సిరిపురం వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతులు తుళ్లూరి సురేష్, వనిత, యోగులు, వెంకటేశ్వర్లు అని పోలీసులు తెలిపారు. శనివారం తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. కొత్తకారుకు పూజలు చేయించేందుకు వీరంతా కొండగట్టుకు వెళ్లారని వివరించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా నిర్ధారించినట్లు పేర్కొన్నా రు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.