oplus_0

అధ్యక్ష కార్యదర్శులుగా మహేష్, సుమన్.

అగ్నిధారన్యూస్ ( కలెక్టరేట్ ) బుధవారం రోజు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సమీకృత కార్యాలయంలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ ట్రెసా ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశం అనంతరం పెద్దపల్లి జిల్లా తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ ( ట్రెసా) జిల్లా అధ్యక్ష , కార్యదర్శులతో పాటు కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా జిల్లా సివిల్ సప్లై కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ తహశీల్దార్ మహేష్, ప్రధాన కార్యదర్శిగా ముత్తారం మండలం తహశీల్దార్ సుమన్ తో పాటు, జిల్లాలో వివిధ క్యాడర్లో పనిచేస్తున్న వారిని కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రవీందర్, ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్, రాజకుమార్, కలెక్టరేట్ ఏవో శ్రీనివాస్, రెవెన్యూ ఉద్యోగులు నూతనంగా ఎన్నిక కాబడిన కమిటీ సభ్యులందరిని ఘనంగా సన్మానించారు. అధ్యక్ష కార్యదర్శులు మహేష్, సుమన్, మాట్లాడుతూ… మా మీద నమ్మకంతో, ఏకగ్రీవంగా బాధ్యతలు అప్పగించిన జిల్లా రెవెన్యూ ఉద్యోగస్తులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి, రాష్ట్ర కమిటీ సహాయ సహకారాలతో అహర్నిశలు కృషి చేస్తామన్నారు.