oplus_0

ట్రెసా అంటే నమ్మకం భరోసా, భద్రత, నమ్మకం,

పులి చర్మం కప్పుకుంటే కుక్క పులి కాదు.

కుట్రదారులు విచ్ఛిన్నకారులు వస్తారు జరభద్రం.

రెవెన్యూ శాఖకు పూర్వవైభవం వస్తుంది.
ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్.

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి

బుధవారం రోజు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సమీకృత కార్యాలయంలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, కలెక్టరేట్ ఏవో డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి సర్వసభ్య సమావేశానికి ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రవీందర్ హాజరై మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో( ట్రెసా) కట్టుబడి ఉంది అన్నారు. గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి అనేక కుట్రలు పన్నింది అన్నారు. వేలాదిమంది ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసింది అన్నారు.విలీనం చేసే కుట్రలు చేసిందన్నారు. అయినప్పటికీ
తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ ( ట్రెసా) ఆధ్వర్యంలో ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుని పలుమార్లు కలిసి క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించానని రవీందర్ తెలిపారు. ఆనాటి ప్రభుత్వంలో ఉన్న భయానక పరిస్థితులు నేడు రెవెన్యూ శాఖలో లేవన్నారు. రెవెన్యూ ఉద్యోగులను చీకటి రోజుల నుండి నేడు వెలుతురులోకి వచ్చామన్నారు. ఉద్యోగుల సంక్షేమంతో పాటు, సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎన్నో ఏళ్లుగా, ట్రెసా పనిచేసుకుంటూ పోతూ ఉన్న క్రమంలో.. ఈ మధ్యకాలంలో ఏవో కొత్త కొత్త సంఘాల పేరుతో ఉద్యోగులను క్యాడర్ల వారిగా క్యాస్ట్ ల వారీగా విడదీయడానికి తీయడానికి భారీ కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. వీఆర్ఏ క్యాడర్ నుండి డిప్యూటీ కలెక్టర్ క్యాడర్ వరకు ఉన్న సమస్యలను పరిష్కరించడంలో ( ట్రెసా) నిర్విరామంగా కృషి చేస్తుందన్నారు. గత పది సంవత్సరాల కాలంలో రెవెన్యూ శాఖ భయానక వాతావరణ పరిస్థితుల్లో, ఆందోళనలో, అభద్రత భాగంలో, ఉద్యోగులు ఉన్న సమయంలో మీ సంఘం ఎక్కడుందని ఘాటుగా ప్రశ్నించారు. మా సంఘానికి సరిపోలే పేరు పెట్టినంత మాత్రాన మీరు ఉద్యోగులకు నిస్వార్ధంగా న్యాయం చేయగలరా అని ప్రశ్నించారు.
పులి చర్మం కప్పుకున్నంత మాత్రాన కుక్క పులి కాదని ఎద్దేవ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థకు మళ్ళీ పూర్వ వైభవం తీసుకువచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తామని సమావేశంలో పేర్కొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ శాఖ ఉంది అంటే ( ట్రెసా) కృషి మరువలేనిది అన్నారు. అనేక సంఘాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. వారి ఉచ్చులో పడి మోసపోవద్దని హెచ్చరించారు. రెవెన్యూ శాఖ అంటే ( ట్రెసా). ,ట్రెసా అంటే రెవెన్యూ శాఖ అన్నారు. ట్రెసా. అంటే భరోసా, బాధ్యత, నమ్మకం, అన్నారు.గత పాలకులు రెవెన్యూ శాఖను రద్దు చేసే జీవోలు తీసే కుట్రలు జరిగినప్పుడు మీ సంఘం ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. ఉద్యోగుల ఐక్యతను చిన్నాభిన్నం చేసే కుట్ర దారులు పుట్టుకొచ్చారని భద్రంగా ఉండాలని సమావేశంలో పాల్గొన్న ఉద్యోగులకు ఉద్యోగులకు గుర్తు చేశారు. అదేవిధంగా ఉద్యోగులంతా క్షేత్రస్థాయిలో కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రెవెన్యూ శాఖ మంత్రిని కలిసినప్పుడు, రెవెన్యూ ఉద్యోగుల పట్ల సానుకూలంగా స్పందించారని గుర్తు చేశారు. జనవరి ఫిబ్రవరి వరకు కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చే అవకాశం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రెసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్, రాష్ట్ర నాయకులు రాజకుమార్, భారీ సంఖ్యలో రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.