లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు జర్పుల దశరథ్ నాయక్.
అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి)
కడ్తాల్ మండలంలోని మైసిగండి గ్రామానికి చెందిన గిరిజన అగ్ర నేతలు గత ఎన్నికల్లో వేర్వేరు పార్టీల నుండి హోరాహోరీగా బరిలోదిగి ఎంపిటిసిలుగా పోటీ చేసినటువంటి మోత్యా నాయక్, హర్యానాయకులు మళ్లీ స్థానిక ఎన్నికలు రాకముందే మరణించడం మైసిగండి గ్రామానికి, గిరిజన జాతికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేసిన లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు, కడ్తాల్ మాజీ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ తీవ్రఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంపరంగా గిరిజన జాతిలో అగ్రస్థానాన్ని సంపాదించుకున్న ఈ ఇద్దరు నాయకులు ఈరోజు తమ మధ్యన లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. తమ మధ్యన లేకపోవచ్చు కానీ వారు చేసినటువంటి సేవలు మాత్రం తమ మదిలో శాశ్వతంగా నిలిచిపోతాయని తెలిపారు. ఈ సందర్భంగా వారిని ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. అలాగే వారి కుటుంబ సభ్యులల్లో మనోధైర్యాన్ని నింపాలని కోరారు.
