కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు డోకూరి ప్రభాకర్ రెడ్డి.

అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి)

బుధవారం తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామానికి చెందిన చిల్కం లక్ష్మయ్య అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా ఆరోగ్యంతో బాధపడుతూ  మరణించడం జరిగింది. గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ద్వారా విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు డోకూరి ప్రభాకర్ రెడ్డి మృత్యుడి కుటుంబం పట్ల సానుభూతి తెలుపుతూ 3000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కృష్ణా రెడ్డి , గ్రామ మాజీ సర్పంచ్ శ్యామ్ సుందర్ రెడ్డి, గ్రామ మాజీ ఎంపీటీసీ తిక్కల వెంకటయ్య, గ్రామ నాయకులు కాకి కృష్ణ, శ్రావణ్ కుమార్ రెడ్డి,శ్రీను, యువజన కాంగ్రెస్ మండల నాయకుడు శివ, వెంకటేష్, శివ ,హరీష్ ,  తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.