అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ 

సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సుగ్లాంపల్లి గ్రామంలో గల నారాయణపూర్ ఎక్స్ రోడ్ వద్ద  శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా మృతి చెందింది. వివరాల్లోకి వెళితే కరీంనగర్ నుండి పెద్దపల్లి వైపు ఎరువుల లోడుతో వెళ్తున్న లారీ మహిళపై బోల్తా పడడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మరొకరు తీవ్రంగా గాయపడడంతో సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.